Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Saturday, December 24, 2022

Yadagirigutta old photos | యాదగిరిగుట్ట పాత చిత్రాలు | Yadagirigutta in 2012

 Yadagirigutta old photos | యాదగిరిగుట్ట పాత చిత్రాలు 







Read more...

Wednesday, November 30, 2022

యాదాద్రి లో వంద పడకల ఏరియా ఆసుపత్రి | 100 Beds Area Hospital in Yadadri


యాదాద్రి యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) ని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అబివృద్ది చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విదాన పరిషత్ నిర్ణయం తీసుకుంది, ఇందుకు సంబందించి GO No.722, dated 29-11-2022 ని విడుదల చేస్తూ, అభివృద్ది పనుల కోసం 45.79 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి ఇచ్చింది. 

దిన దినం అబివృద్ది చెందుతున్న యాదగిరిగుట్ట పట్టణంలో పూర్తి స్థాయి ఆసుపత్రి లేదు, అలాగే యాదగిరిగుట్ట మండలం, చుట్టూ ఉన్న రాజాపేట, తుర్కపల్లి, మూటకొండూరు మండలలోని గ్రామాలలో లో కూడా పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు లేవు, ఆసుపత్రీలు లేవు. దీనికి తోడు, యాదాద్రి ఆలయం అద్బుతంగా అభివృద్ది చెంది, భక్తల రాక కూడా గణనీయంగా పెరిగింది. ఇక్కడి కి వచ్చే భక్తులకు అత్యవసర పరిస్థితులలో కూడా సరి  అయిన వైద్య సౌకర్యాలు అందించే అవకాశం ఇంతకాలం యాదగిరిగుట్ట లో లేదు. ఇవన్నీ విషయాలను  సి ఏం కెసిఆర్ గారు వచ్చినప్పుడు స్థానిక ఏం ఎల్ ఏ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిగారు, అలాగే స్థానిక మునిసిపల్ ఛైర్మన్ ఎరుకల సుధ మహేందర్ గారు, మునిసిపల్ కౌన్సిలర్లు సి ఏం దృష్టి కి తీసుకు వెళ్ళడం జరిగినది. ఫిబ్రవరి లో వైద్య శాఖ మంత్రి హోదాలో వచ్చిన శ్రీ హరీష్ రావు గారికి కూడా పురపాలక సంఘం తరపున శ్రీమతి సుధ మహేందర్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. 


తమ వినతికి సానుకూలంగా స్పందించి యాదగిరిగుట్ట లో వంద పడకల ఆసుపత్రి కి అనుమతి ఇవ్వడం పట్ల యాదగిరిగుట్ట మునిసిపల్ ఛైర్మన్ శ్రీమతి ఎరుకల సుధ మహేందర్ గారు, రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావ్ గారీకి, ఆలేరు ఏం ఎల్ ఏ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి పురపాలక సంఘం పక్షాన, యాదగిరిగుట్ట ప్రజల పక్షాన  హర్షం ప్రకటిస్తూ, కృతజ్ఞతలు తెలియచేశారు.



#Yadadri #Yadagirigutta

Read more...

Monday, November 21, 2022

Yadadri one day inocme new record 1.16 Crore per day

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం - యాదగిరిగుట్ట,యాదాద్రి ఈ రోజు యాదాద్రి దేవస్థానం ఆదాయం రూ 1,16,13,977 /- దేవస్థాన చరిత్రలో మరో కొత్త రికార్డు. తేది: 20/11/2022

శ్రీ స్వామి వారి ఆదాయము రూ 1,16,13,977 /-
ప్రధాన బుకింగ్ 3,24,650/-
కైంకర్యములు 16,100 /-
సుప్రభాతం 10,300/-
వ్రతాలు 15,20,000/-
ప్రచార శాఖ 2,87,500/-
VIP దర్శనం 18,90,000/-
యాదరుషి నిలయం 1,92,500/-
ప్రసాదవిక్రయం 44,37,150/-
పాతగుట్ట. 3,78,670/-
కళ్యాణ కట్ట 1,78,000/-
శాశ్వత పూజలు 37,500/-
వాహన పూజలు 31,200/-
కొండపైకి వాహన ప్రవేశం 9,75,000/-
సువర్ణ పుష్పార్చన 2,52,348/-
వేద ఆశీర్వచనం 19,800/-
శివాలయం 32,600/-
లక్ష్మి పుష్కరిణి -Nil
అన్నదానము 55,659/-
లిజేస్ Nil
ఇతరములు Nil
బ్రేక్ దర్శనం 9,75,000/-

Read more...

Tuesday, November 15, 2022

One Day One Crore Yadadri Income | ఒక రోజు ఒక కోటి ఆదాయం లో యాదాద్రి సరికొత్త రికార్డు


యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్ర లో రికార్డు స్థాయిలో గత ఆదివారం (06-11-2022) నాడు మొట్టమొదటి సారి స్వామి వారి ఒక రోజు ఆదాయం 85.62 లక్షల దాటగా, ఈ ఆదివారం (13-11-2022) నాడు గత వారం రికార్డు ను తిరగ వ్రాస్తూ రూ.1,09,82,446/-  ఆదాయంతో సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. 

యాదాద్రి ఆలయం పునః ప్రారంభం (28 మార్చ్ 2022) అయిన తరువాత ప్రతి నెలలో ఏదో ఒక రోజు రికార్డు స్తాయిలో ఆదాయం సమకూరుతుంది, యాదగిరిగుట్ట కు వచ్చే భక్తులు కూడా గణనీయంగా పెరిగారు, సెలవు రోజుల్లో యాదగిరి కొండ చుట్టూ, యాదగిరికొండ పై ఎటు చూసిన భక్తుల కొలహాలం కనిపిస్తుంది. స్వామి వారి పట్ల భక్తులలో పెరుగుతున్న విశ్వాసం, ఆదరణ అనిర్వచనీయమైనది. 

తెలంగాణ ప్రభుత్వం, YTDA ఆద్వర్యంలో ఎంతో దూరదృష్థి తో యాదగిరిగుట్ట దేవస్థానానికి దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ జరిపి, కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటు తేవడం వలన ఇక్కడి కి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు, అయిన ఇంకా భక్తులకు సౌకర్యాల లేమి అప్పుడప్పుడు తెరపైకి వస్తూంది. ఇంకా చాలా అభివృద్ది పనులు పెండిగ్ లో ఉన్నాయి, కొన్ని నత్త నడక సాగుతున్నాయి, పనులన్నీ పూర్తి అయితే యాదాద్రి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని సరికొత్త ఆద్యా యాలు లిఖించడం ఖాయం.     

 

13-11-2022 నాటి ఆదాయ వివరాలు

*శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం - యాదగిరిగుట్ట,యాదాద్రి  :
తేది: 13/11/2022*

శ్రీ స్వామి వారి ఆదాయము : రూ1,09,82,446 /-
ప్రధాన బుకింగ్ 3,57,650/-
కైంకర్యములు 10,532/-
సుప్రభాతం    3000/-
వ్రతాలు      13,44,800/-
ప్రచార శాఖ 2,16,500/-
VIP దర్శనం  22,65,000/-
యాదరుషి నిలయం 2,01,332/-
ప్రసాదవిక్రయం 37,36,550/-
పాతగుట్ట. 3,37,650/-
కళ్యాణ కట్ట 1,91,700/-       
శాశ్వత పూజలు 42,645/-        
వాహన పూజలు 32,500/-
కొండపైకి వాహన ప్రవేశం 10,50,000/-
సువర్ణ పుష్పార్చన 2,83,160/-
వేద ఆశీర్వచనం  16,200/-
శివాలయం 19,300/-
లక్ష్మి పుష్కరిణి     -Nil
అన్నదానము 1,78,827/-
లిజేస్  Nil        
ఇతరములు Nil
బ్రేక్ దర్శనం 6,95,100/-

 

Read more...

Sunday, October 30, 2022

Yadadri Break Darshan | Yadadri VIP Darshan | Yadadri Special Darshan | యాదాద్రి బ్రేక్ దర్శనాలు ప్రారంభం

Yadadri Yadagirigutta Sri Laxmi Narasimha Swamy Devasthanam is going to start VIP Break Darshan from 31-10-2022 every day from Morning 9 AM to 10 AM and 4 PM to 5 PM in two batches, each batch 200 tickets will be sale total 400 VIP Tickets for a day and Price is Rs.300/- Each. 

Now Online Booking also available for this at https://yadadritemple.telangana.gov.in/  

(Updated 23-01-2023)

 

 

Yadadri Break Darshan Yadagirigutta Break Darshan Yadadri Darshan Timings

How to Book Yadadri Yadagirigutta Break Darshan Online

How to Book Yadadri Darshan Booking ONline


 


 


Read more...

Saturday, October 22, 2022

YADADRI KARTHIKA MASAM SATYANARAYANA VRATHAM 2022 SCHEDULE

Yadadri Sri Lakshminarshima Swamy Devasthanam, Yadadri Yadagirigutta during Coming  Kartheeka masam. Keeping in mind the demand, increased the batches of Satyanarayana Swamy Vratham from present four to six per day during the month Karthika Masam 2022. About 250 couples would be provided opportunity in each batch of Satyanarayana Swamy vratham, which would be performed from 5 am to 7 pm at New Satayanarayana Vrtha Mandapam, Near 3rd Ghat Road Entrance, Yadagirigutta everyday in this month starting from 26th October 2022 to 23 November 2022. 

Now Online Booking also available, dovotee can purchase tickets at https://yadadritemple.telangana.gov.in/

Vratham Batch Timings : 

6:30 AM TO 7:30 AM | 8:30 AM TO 9:30 AM | 10:30 AM TO 11:30 AM |

12:30 PM TO 1:30 PM | 2:30 PM TO 3:30 PM | 4:30 PM TO 5:30 PM

Read more...

Thursday, October 20, 2022

Yadadri Temple Awarded Green Place of Worship

Sri Laxmi Narasimha Swamy Devasthanam Yadadri Yadagirigutta Awarded "Green Place of Worship" by the Indian Green Building Council for the Year 2023-25.  Mr G Kishan Rao, IAS (Rtd), Vice Chairman and CEO of YTDA informed the same in a press release. 


The award is for the complied the norms of the Reconstruction of the Temple such as Preservation of the 13 Century Temple, Rock preservation outside temple premises, Air Condition design, utilizing of Natural light and air, extensive greenery more than 40% of the total site area, parking spaces and shuttle services etc.,



Read more...

Monday, September 12, 2022

Yadadri Yadagirigutta Online Booking now available | How to Book Yadadri Online Seva Booking

SLNS Devasthanam Yadagirigutta now started new website for all seva booking online watch full video for more details


Online Booking Service Started in Yadadri Temple, Yadagirigutta 15.07.2022 website id https://yadadritemple.telangana.gov.in/ 

Yadadri online seva yadagirigutta online seva yadadri online booking yadadri online accommodation booking yadadri online darshan booking yadadri online vehicle pooja booking yadadri abhisehkam yadadri archana seva booking yadadri room booking

Read more...

YTDA Divya Sannidhi Villas Booking | Yadagirigutta Accomodation | Yadadri VIP Villa Booking | Yadagirigutta Room Booking

 How to book Yadadri Yadagirigutta Accommodation Online | YTDA Villas Watch Video for full details and Exclusive views and information 


Yadadri Room Booking | Yadagirigutta Room Booking

Read more...

Wednesday, August 24, 2022

Yadadri Needs New Steps way at North Side

యాదాద్రి లో మరో మెట్ల దారి కావాలా?!

యాదాద్రి యాదగిరిగుట్ట పునర్నిర్మాణం, పునః ప్రారంభం తరువాత వివిద రకాల అసౌకర్యాలకు గురవుతున్న భక్తుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు, కొండపైకి అన్నీ రకాల వాహనాలను రావడం నిషేదించిన తరువాత, 500 రూపాయల ప్రవేశ రుసుముతో సామాన్యులు తమ వాహానాలతో కొండపైకి వెళ్ళే పరిస్థితి లేదు, కొండపైకి వెళ్ళేడానికి రావాడానికి మిగిలినవి రెండే ఆప్షన్లు

పుష్కరిణ చెంత బస్సు ఎక్కడానికి భక్తుల కుస్తీలు 

1. ఆర్టీసీ వారి ఉచిత బస్సులు :  రద్దీ ఎక్కువున్న రోజుల్లో ఇవి కూడా సరిపోవడం లేదు, అలాగే, భక్తలు ఎక్కిన  చోట కాకుండా వేరే చోట దింపేయడం తో భక్తులు అయోమయానికి లోనయ్యి తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

దక్షిణం వైపున ఉన్న ఏకైక మెట్ల దారి, మొదటి మెట్టు నిర్మాణం కూడాసరిగ్గా చేయలేదు 

2. మెట్ల దారి : గతంలో మూడు వైపులా నుంచి మెట్ల దారులు ఉండేవి, గోశాల దగ్గరిలో పాదాల దగ్గర ఒకటి, మెయిన్ రోడ్ వైకుంఠ ద్వారం వద్ద ఒకటి, అలాగే పాత మెట్ల దారి (వైభవేష్ఠి ద్వారం).  పునర్నిర్మాణం పేరుతో వీటన్నిటిని కూలదోసి అన్నీటి నిర్మాణం చేయలేదు, ప్రస్తుతం కొండకు దక్షిణం వైపున మెయిన్ రోడ్ వైకుంఠద్వారం ఒకటే వాడుకలో ఉంది, దీని నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదు. మొదటి మెట్టు దగ్గరే సరిఅయిన నిర్మాణం చేయకపోవడంతో చాలా అసౌకర్యంగా ఉన్నది, కొద్ది దూరం తరువాయి నిర్మాణాన్ని మద్యలోనే వదిలి వేశారు.

ఉత్తరం వైపు బస్సుల కోసం ఎదురు చూపు, ఇటువైపు మెట్ల దారి ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది

ప్రస్తుతం దేవాలయానికి సంబంధించిన ప్రదాన సేవలు కొండకు వెనుక వైపున ఉన్న గండి చెరువు దగ్గరే ఏర్పాటు చేశారు, లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్ట, అన్నదానం, సత్యనారానాయణ వ్రతాలు, వాహనాల పార్కింగ్ మొదలగునవి. అలాగే త్వరలో ఇక్కడే యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, దుకాణాల సముదాయం, వాహన పూజాలు ప్రారంభం కాబోతున్నాయి.  వీటి నిర్మాణాలు చాలా చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడి నుంచి కొండపైకి వెళ్లాలన్న, క్రిందికి రావాలన్న ఒకటే ఆప్షన్ ఆర్టిసి వారి ఉచిత బస్సు. మొదట్లోనే చెప్పినట్టు రద్దీ రోజుల్లో ఇవి కూడా సరిపోవు, ఇటువైపు నుంచి కొండపైకి వెళ్ళడానికి, క్రిందికి రావడానికి  ఎటువంటి మెట్ల దారి ప్రస్తుతానికి లేదు, అభివృద్ది అంతా ఇటువైపే జరుగుతుంది కాబట్టి కొండకు ఉత్తరం వైపున మరో మెట్ల దారి నిర్మాణం ఉంటే బాగుంటుందని స్థానికంగా చర్చ నడుస్తుంది, భక్తులు కూడా ఇలాగే భావిస్తున్నారు. 

కళ్యాణ కట్ట వద్ద బస్సుల కోసం నిరీక్షణ 

కళ్యాణ కట్ట లో తలానీలాలు తీసుకుని, లక్ష్మీ పుష్కరిణిలో స్నానమాచరించి, కాలినడకన దర్శనానికి వెళ్లాలనుకునే వారుంటారు, కాలినడకన కొండపైకి వస్తామని మొక్కుకునే భక్తలు ఉంటారు, ప్రకృతి రమనీయతను ఆస్వాదిస్తూ కొండ ఎక్కాలనుకునే వారుంటారు, కొండలెక్కడం హాబీగా భావించేవారు ఉంటారు, ప్రస్తుతం ఇటువంటి భక్తులందరు పుష్కరిణి చెంత బస్సుల కోసం అసంతోషంగా వేచి చూడడం కనిపిస్తున్నది. వీళ్ళంతా మెట్ల దారి కోసం దక్షిణం వైపున ఉన్న వైకుంఠద్వారం వరకు వెళ్లాలంటే చాలా వ్యయప్రయాసలను ఎదుర్కోవలసిందే!! అలాగే ఏదైనా అనుకోని సంఘటన జరిగి మూడవ ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతించకుంటే, అప్పడు ఉత్తరం వైపునుంచి  కొండ మీదికి, క్రిందికి రావడానికి వేరే ప్రత్యామ్నయం కూడా లేదు.

ఉత్తరం వైపు మెట్ల దారి కోసం అనువుగా ఉన్న కొండ ప్రాంతం 

YTDA అదికారులు, దేవస్థానం అదికారులు ఈ విషయమై ఆలోచించి, కొండకు ఉత్తరము వైపున ప్రస్తుతం సత్యనారాయణ వ్రత మండపం నిర్మాణమౌతున్న భవనం వెనక వైపునుంచి, అలాగే కొత్తగా నిర్మాణమౌతున్న బస్టాండ్ వెనుకవైపు నుంచి, గిరి ప్రదక్షిణ రోడ్డును కలుపుతూ కొండపైకి కొత్తగా మెట్ల దారులను నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు, భక్తులు  అభిప్రాయ పడుతున్నారు.

Read more...

Saturday, May 14, 2022

Poor Arrangements at Yadadri Cultural Program


యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి వారి దేవస్థానానం అదికారులకు,  సిబ్బందికి గతంలొ సరస్వతి కళా మందిరంలొ దశబ్దాల పాటు విజయవంతంగా సంస్కృతిక, సంగీత, సాహిత్య కార్యక్రమలు జరిపిన అపార అనుభవం ఉంది. యాదగిరిగుట్ట సరస్వతి కళామందిరంలొ అరంగేట్రం చేయలనే కొరిక కలిగే కళాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. యాదగిరిగుట్ట దేవస్థాన కళా ప్రాంగణంలొ ఒక్కసారైన ప్రదర్శన ఇవ్వాలనే కొరిక కల వారు చాల మంది ఉంటారు ఇటువంటి వారి అందరి కొరికలు గతంలొ ఫలించేవి. దేవస్థానం వారు కూడ ప్రతి కళకారున్ని గౌరపూర్వకంగా అవకశమిచ్చి, వారిని అతిధి మర్యదలతొ సత్కరించి, గౌరవ బహుమానాన్ని కూడ అందిచేవారు. ఏర్పాట్లు కూడ ఘనంగా చేసేవారు. ఇదంతా గతం.

గడిచిన ఏడు ఏళ్ళలొ పునర్మిణం తొ అన్ని మారిపొయాయి, కళలకు నిలయమై, కళాకారులకు అద్బుత అవకశాలిచ్చిన సరస్వతి కళా మందిరం తొలగింపుతొ గుట్ట లొ సంస్కృతిక కార్యాక్రమాలే జరగడం నిలిచిపొయింది.  దేవస్థానం అదికారులు కూడ అలవాటు మరిచిపొయినట్టున్నారు. నిన్న నరసింహా జయతి సందర్బంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు విచ్చేసిన కళకారులకు కానీ, కళాభిమానులకు కానీ, భక్తులకు, ప్రేక్షకులకు కాని ఏ మాత్రం సంతృప్తి కరంగా అనిపించలేదు. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన బుజ్జి బుజ్జి లౌడ్ స్పీకర్లను చూసి అంతా ఆవాక్కయ్యారు, అందులొని శబ్దం వినసొంపుగా లేక అందరు ఇబ్బంది పడ్డారు. దేవస్థానం అదికారులు మంచి సౌండ్ సిస్టంతొపాటు, లైటింగ్ తదితర మంచి ఏర్పాటులు చేయాలని స్థానిక కళాబిమానులు, స్థానికులు కొరుతున్నారు.

Read more...

Narasimha Jayanthi Celebrations 2022

 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు 2022, ఆలయ పునః ప్రారంబం తరువాత మొదటి సారి జరుగుతున్నాయి. 13-05-2022 నుండి 15-05-2022 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.







Read more...

Monday, May 2, 2022

EO Geetha on Leave | Incharge EO Ramakrishna Rao

SLNSD Devasthanam Yadagirigutta EO Smt Geetha went on leave from today on personal issues, and incharge EO Sri Rama Krishna Rao taken charges from today at Yadadri Temple.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్.గీత గారు వ్యక్తిగత సెలవుపై వెళ్లినందున వారి స్థానములో ఈ రోజు నుండి శ్రీ రామకృష్ణరావు డిప్యూటీ కమిషనర్, దేవాదాయశాఖ గారు ఈ దేవస్థాన ఇంచార్జి కార్యనిర్వహణాధికారిగా విధులకు హాజరైనారు.

Read more...

Sunday, April 17, 2022

Yadadri Temple Darshan Timings | Yadagirigutta New Temple Darshan Timings

Yadadri Temple Darshanam Timings

యాదాద్రి యాదగిరిగుట్ట ఆలయ దర్శన వేళలు

Yadagirigutta New Temple DarshanamTimings 

Morning

6:00 to 7:30     Sarva Darshanam
9:00 to 10:00   Break Darshanam
10:00 to 11:45 Sarva Darshanam

Noon

12:30 to 3:00    Sarva Darshanam

Evening

4:00 to 5:00     Break Darshanam
5:00 to 7:00     Sarva Darshanam

8:15 to 9:00     Sarva Darshanam

 

Note : 

Due to heavy Rush Break Darshanam may cancelled any day, any time without any prior notice by Devasthanam

 

Read more...

Yadadri Temple Timings | Yadagirigutta New Temple Timings

Yadadri Temple Timings


Yadagirigutta New Temple Timings 


Morning

4:00                  Doors Open
4:00 to 4:30     Suprabhatham
4:30 to 5:00     Binde Theertham, Aradhana
5:00 to 5:30     Swami variki Balabhogam
5:30 to 6:00     Pushpalankarana Seva
6:00 to 7:30     Sarva Darshanam
7:30 to 8:30     Swamivariki Nijabishekam
8:30 to 9:00     Sahasranamarchana
9:00 to 10:00   Break Darshanam
10:00 to 11:45 Sarva Darshanam

11:45 to 12:30 Rajabhogam (aaraginpu)

Noon

12:30 to 3:00    Sarva Darshanam
3:00 to 4:00     Temple Closed (except Sat and Sundays)

 

Evening

4:00 to 5:00     Break Darshanam
5:00 to 7:00     Sarva Darshanam

7:00 to 7:45     Thiruvaraadhana
7:45 to 8:15     Swami variki Sahasranamarchana Ammavariki Kumkum archana
8:15 to 9:00     Sarva Darshanam
9:00 to 9:30     Rathri Nivedana (Aragimpu)
9:30 to 9:45     Shayanotsavam, Dwarabandanam
9:45                 Temple Closed.

Read more...

Wednesday, March 23, 2022

Yadadri Inauguration on 28 March 2022

After a long waiting of around 7 years, Yadagirigutta reconstructed Yadadri Temple is going to be opened on 28 March 2022 at 11:55 AM by Hon'ble Chief Minister of Telangana Sri K Chandashekhar Rao. All the arrangements have been preparing and the Panchakundthmaka Yagam is going on from 21.03.2022 at Yadagiri Hill, the Maha Kumbha Samporkshana will be held on 28 March 2022. 

  • Due to this all the arjitha Sevas are moved to Pathagutta Temple

  • Sarvadarshanam is available as it is in Bala Alayam until 27 March 2022

  • 75 RTC Buses will roam around Ring Road to Uphill during this event

  • Direct Buses from MGBS, JBS to Yadadri Uphill also planned 

  • 2000 Police officers will be appointed for Security

  • Gandi Cheruvu is filled with Godavari Water which taken from Kaleshwaram to Mllanna Sagar to Baswapur Reservoir (Narasimha Sagar)

  • Along with New Temple, New Kalyana Katta, New Bus Station, New Pusharini, New Ghat Road also available at Gandi Cheruvu Area from 28 March 2022




Read more...

Tuesday, January 4, 2022

JAGADGIRIGUTTA TO YADAGIRIGUTTA NEW RTC BUS SERVICE

 


New Year 2022, New Bus Services has started from Jagadgirigutta to Yadagirigutta by Kukatpally TSRTC Department. Daily 2 services will be available and will be go Through IDPL Colony, Balanagar, JBS, Tarnaka, Uppal, Ghatkesar, Bhongir, Yadagirigutta. in view of obvserving heavy commuters in this route TSRTC starting this new services

/

Bus Timings UP : 

Starting from Jagadgirigutta Daily Morning 8 AM and 2 PM

Bus Timings Down : 

Returning starts from Yadagirigutta Daily 11 AM and 5 PM


 #TSRTC #Yadagirigutta_buses #Jagadgirigutta_to_Yadagirigutta_Bus

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP