యాదగిరిగుట్ట, తెలంగాణ – ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా క్లార్ నేడు యాదగిరిగుట్టను సందర్శించారు. ఈ సందర్శనలో ఆమె స్వామి వారి దర్శనం చేసుకొన్నారు. ఆలయ అధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ వో భాస్కర్ రావు ఆలయ చరిత్ర, విశిష్టతలను ఆమెకు తెలియ చేశారు.
డెన్మార్క్ దేశస్తురాలైన విక్టోరియా క్లార్, ఇటీవల 2024 మిస్ యూనివర్స్ హోదాను సాధించిన ప్రముఖ సౌందర్య రాణి, భారతదేశంలోని సంప్రదాయ మరియు ధార్మిక ప్రదేశాలను సందర్శించడం కోసం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆమెకు యాదగిరిగుట్ట ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగింది. ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమె యాదగిరిగుట్టలో పూజలు నిర్వహించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
యాదగిరిగుట్ట ను సందర్శించిన మొట్ట మొదటి విశ్వ సుందరిగా విక్టోరియా క్లార్ ఆలయ రికార్డులో నిలుస్తారు. ఆమె సందర్శన ఆమె తో పాటు అక్కడ ఉన్న భక్తులకు, స్థానికులకు ఒక మరిచిపోలేని అనుభూతి గా నిలుస్తుందండంలో అతిశయోక్తి లేదు.
#yadadri #yadagirigutta #Telangana #MissUniverse #missuniversedenmark2024 #MissUniverse2024 #VictoriaKjærTheilvig
No comments:
Post a Comment
Please visit again to this site, will be replied your comment shortly