Pages

Thursday, January 29, 2026

A New Chapter at Yadagirigutta Devasthanam : Bhavani Shankar IAS | యాదగిరిగుట్ట ఈవో గా భవాని శంకర్ బాద్యతల స్వీకరణ

 


యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా (Executive Officer, EO) ఐఏఎస్ అధికారి జే. భవాని శంకర్ అధికారికంగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనను, పూజారులు, దేవస్థాన అధికారులు సంప్రదాయబద్దంగా వారిని దేవాలయంలోనికి  ఆహ్వానించారు, స్వామి వారిని దర్శించుకున్న తరువాత అధికారంగా అయన బాద్యతలు స్వీకరించారు. 

భవాని శంకర్ గారు గవర్నర్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా సేవలు నిర్వర్తించేవారు. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయనను యాదగిరిగుట్ట ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు.

జనవరి 1న  గత ఈవో వెంకట్ రావు అనూహ్యంగా రాజీనామా చేయడం అప్పట్లో కలకలం రేపింది, అప్పటి నుంచి నిన్నటి వరకు ఆలయానికి ఈ వో లేకుండానే రోజులు గడిచిపోయాయి. 

 ఈనెల 17న  భవాని శంకర్ ని (నాన్ క్యాడర్) లో యాదగిరిగుట్ట ఈవో గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  విడుదల చేసిన, వివిధ కారణాలచేత ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. జనవరి 21న భవాని శంకర్ ని IASగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఐఏఎస్ హోదాలో ఆలయ ఈవో గా భాద్యతలు స్వీకరించినారు. 

 ఆలయ పరిపాలన, భక్తుల సేవలు, దేవస్థాన సేవల సమపాళ్ల నిర్వహణ వంటి బాధ్యతలతో పాటు భవాని శంకర్ ఈ కొత్త బాధ్యతను ఆలయ ప్రధాన కార్యాలయంలో స్వీకరించారు.

#yadagirigutta #yadadri #manayadadri #yadadritemple #yadagiriguttatemple #yadagiriguttaEO

No comments:

Post a Comment

Please visit again to this site, will be replied your comment shortly