Train to Komuravelli | కొమురవెల్లి కి రైలు సౌకర్యం | మల్లన్న భక్తులకు శుభవార్త | Good News to Mallanna Devotees

  • జూలై 26 నుంచి కొమురవెల్లి కొత్త రైలు సేవలు ప్రారంభం
  • సిద్ధిపేట, సికిందరాబాద్ వైపు నుంచి ప్రయాణించే భక్తులకు అవకాశం 
  • కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం 

హైదరాబాద్, జూలై 25: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు శుభవార్త. ఈ నెల జూలై 26 నుంచి సికింద్రాబాద్–కొమురవెల్లి మధ్య రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు నూతనంగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య నడిచే రైళ్లు ప్రతి రోజు కొమురవెల్లి స్టేషన్‌లో కూడా ఆగనున్నాయి.

ఈ రైలు సేవలతో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, జనగామ, సిద్దిపేట ప్రాంతాల నుంచి కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. ఇప్పటి వరకు ప్రధానంగా రోడ్డు మార్గానికే పరిమితమైన ప్రయాణానికి ఇప్పుడు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి రావడం విశేషం.

సుమారు ₹5.63 కోట్ల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ ప్రారంభం వల్ల తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన కొమురవెల్లికి భక్తుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ప్రతిపాదిత రైలు సమయాలు ఆలయ దర్శన సమయాలకు పూర్తిగా అనుకూలంగా లేవని ప్రయాణికుల సంఘాలు సూచించాయి. ఉదయం తొందరగా కొమురవెల్లికి చేరే విధంగా, సాయంత్రం తిరుగు ప్రయాణానికి అనువుగా అదనపు సేవలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వేను కోరాయి.

Komuravelli Train Table Click Here

#siddipet #secunderabad #scr #komuravelly #demomemu #indianrailways #Komuravelli Train #komuravelli


Comments