Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Monday, September 12, 2022

Yadadri Yadagirigutta Online Booking now available | How to Book Yadadri Online Booking

SLNS Devasthanam Yadagirigutta now started new website for all seva booking online watch full video for more details


Online Booking Service Started in Yadadri Temple, Yadagirigutta 15.07.2022 website id https://yadadritemple.telangana.gov.in/

Read more...

YTDA Divya Sannidhi Villas Booking | Yadagirigutta Accomodation | Yadadri VIP Villa Booking

 How to book Yadadri Yadagirigutta Accommodation Online | YTDA Villas Watch Video for full details and Exclusive views and information Read more...

Wednesday, August 24, 2022

Yadadri Needs New Steps way at North Side

యాదాద్రి లో మరో మెట్ల దారి కావాలా?!

యాదాద్రి యాదగిరిగుట్ట పునర్నిర్మాణం, పునః ప్రారంభం తరువాత వివిద రకాల అసౌకర్యాలకు గురవుతున్న భక్తుల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు, కొండపైకి అన్నీ రకాల వాహనాలను రావడం నిషేదించిన తరువాత, 500 రూపాయల ప్రవేశ రుసుముతో సామాన్యులు తమ వాహానాలతో కొండపైకి వెళ్ళే పరిస్థితి లేదు, కొండపైకి వెళ్ళేడానికి రావాడానికి మిగిలినవి రెండే ఆప్షన్లు

పుష్కరిణ చెంత బస్సు ఎక్కడానికి భక్తుల కుస్తీలు 

1. ఆర్టీసీ వారి ఉచిత బస్సులు :  రద్దీ ఎక్కువున్న రోజుల్లో ఇవి కూడా సరిపోవడం లేదు, అలాగే, భక్తలు ఎక్కిన  చోట కాకుండా వేరే చోట దింపేయడం తో భక్తులు అయోమయానికి లోనయ్యి తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

దక్షిణం వైపున ఉన్న ఏకైక మెట్ల దారి, మొదటి మెట్టు నిర్మాణం కూడాసరిగ్గా చేయలేదు 

2. మెట్ల దారి : గతంలో మూడు వైపులా నుంచి మెట్ల దారులు ఉండేవి, గోశాల దగ్గరిలో పాదాల దగ్గర ఒకటి, మెయిన్ రోడ్ వైకుంఠ ద్వారం వద్ద ఒకటి, అలాగే పాత మెట్ల దారి (వైభవేష్ఠి ద్వారం).  పునర్నిర్మాణం పేరుతో వీటన్నిటిని కూలదోసి అన్నీటి నిర్మాణం చేయలేదు, ప్రస్తుతం కొండకు దక్షిణం వైపున మెయిన్ రోడ్ వైకుంఠద్వారం ఒకటే వాడుకలో ఉంది, దీని నిర్మాణం కూడా ఇంకా పూర్తి కాలేదు. మొదటి మెట్టు దగ్గరే సరిఅయిన నిర్మాణం చేయకపోవడంతో చాలా అసౌకర్యంగా ఉన్నది, కొద్ది దూరం తరువాయి నిర్మాణాన్ని మద్యలోనే వదిలి వేశారు.

ఉత్తరం వైపు బస్సుల కోసం ఎదురు చూపు, ఇటువైపు మెట్ల దారి ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది

ప్రస్తుతం దేవాలయానికి సంబంధించిన ప్రదాన సేవలు కొండకు వెనుక వైపున ఉన్న గండి చెరువు దగ్గరే ఏర్పాటు చేశారు, లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్ట, అన్నదానం, సత్యనారానాయణ వ్రతాలు, వాహనాల పార్కింగ్ మొదలగునవి. అలాగే త్వరలో ఇక్కడే యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, దుకాణాల సముదాయం, వాహన పూజాలు ప్రారంభం కాబోతున్నాయి.  వీటి నిర్మాణాలు చాలా చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడి నుంచి కొండపైకి వెళ్లాలన్న, క్రిందికి రావాలన్న ఒకటే ఆప్షన్ ఆర్టిసి వారి ఉచిత బస్సు. మొదట్లోనే చెప్పినట్టు రద్దీ రోజుల్లో ఇవి కూడా సరిపోవు, ఇటువైపు నుంచి కొండపైకి వెళ్ళడానికి, క్రిందికి రావడానికి  ఎటువంటి మెట్ల దారి ప్రస్తుతానికి లేదు, అభివృద్ది అంతా ఇటువైపే జరుగుతుంది కాబట్టి కొండకు ఉత్తరం వైపున మరో మెట్ల దారి నిర్మాణం ఉంటే బాగుంటుందని స్థానికంగా చర్చ నడుస్తుంది, భక్తులు కూడా ఇలాగే భావిస్తున్నారు. 

కళ్యాణ కట్ట వద్ద బస్సుల కోసం నిరీక్షణ 

కళ్యాణ కట్ట లో తలానీలాలు తీసుకుని, లక్ష్మీ పుష్కరిణిలో స్నానమాచరించి, కాలినడకన దర్శనానికి వెళ్లాలనుకునే వారుంటారు, కాలినడకన కొండపైకి వస్తామని మొక్కుకునే భక్తలు ఉంటారు, ప్రకృతి రమనీయతను ఆస్వాదిస్తూ కొండ ఎక్కాలనుకునే వారుంటారు, కొండలెక్కడం హాబీగా భావించేవారు ఉంటారు, ప్రస్తుతం ఇటువంటి భక్తులందరు పుష్కరిణి చెంత బస్సుల కోసం అసంతోషంగా వేచి చూడడం కనిపిస్తున్నది. వీళ్ళంతా మెట్ల దారి కోసం దక్షిణం వైపున ఉన్న వైకుంఠద్వారం వరకు వెళ్లాలంటే చాలా వ్యయప్రయాసలను ఎదుర్కోవలసిందే!! అలాగే ఏదైనా అనుకోని సంఘటన జరిగి మూడవ ఘాట్ రోడ్డుపై వాహనాలను అనుమతించకుంటే, అప్పడు ఉత్తరం వైపునుంచి  కొండ మీదికి, క్రిందికి రావడానికి వేరే ప్రత్యామ్నయం కూడా లేదు.

ఉత్తరం వైపు మెట్ల దారి కోసం అనువుగా ఉన్న కొండ ప్రాంతం 

YTDA అదికారులు, దేవస్థానం అదికారులు ఈ విషయమై ఆలోచించి, కొండకు ఉత్తరము వైపున ప్రస్తుతం సత్యనారాయణ వ్రత మండపం నిర్మాణమౌతున్న భవనం వెనక వైపునుంచి, అలాగే కొత్తగా నిర్మాణమౌతున్న బస్టాండ్ వెనుకవైపు నుంచి, గిరి ప్రదక్షిణ రోడ్డును కలుపుతూ కొండపైకి కొత్తగా మెట్ల దారులను నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు, భక్తులు  అభిప్రాయ పడుతున్నారు.

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP