Today in Namaste Telangana News paper a report has published regarding the YTDA unappreciable process of layout permissions and corruption in YTDA. I have been receiving so many comments and asking suggestions that, which layout is approved, which is good and where to found the full details etc., Since i too not finding the details am helpless in this regard. Amazingly, till today there is no any online list we have found on online and there is no any local office at Yadagirigutta to find it more as per the citizen information. the blow report as it is copied from Namasthe Telangana online news paper published 05.05.2019
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యాదగిరిగుట్ట.. పవిత్ర పుణ్యక్షేత్రం.. తెలంగాణ
తిరుపతిగా అభివృద్ధిచేసే పనులు జోరుగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్
ప్రత్యేక శ్రద్ధతీసుకొని.. నృసింహస్వామి కొలువుదీరిన ప్రాంతంచుట్టూ
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీని (వైటీడీఏ) 2016లో
ఏర్పాటుచేశారు. వైటీడీఏ పరిధిలో 105 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏడు
రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా
అభివృద్ధిచేయడానికి లోతుగా అధ్యయనంచేసి.. ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్
రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదే అదనుగా భావించిన వైటీడీఏ
టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్రమవసూళ్లకు తెరలేపారు. అనుమతి కోసం ఎవరైనా
వైటీడీఏ చీఫ్‌ప్లానింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్తే చాలు.. ఎకరానికి రూ.60 వేల
నుంచి రూ.70 వేలు సమర్పించాలని.. లేకపోతే, నానా రకాలుగా వేధిస్తున్నారని
పలువురు రియల్టర్లు ఆరోపిస్తున్నారు.
ఇంటిప్లాన్ కరెక్టుగాలేదని..
లే అవుట్ ప్లాన్ మార్చాలని.. మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాలేదని.. షార్ట్‌ఫాల్
ఉన్నదని.. ఇలా రకరకాలుగా అటు ప్రజలు ఇటు డెవలపర్లతో ఆటాడుకుంటున్నారని
వాపోతున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మాదిరిగానే ప్లాన్లను
సిద్ధంచేసినా.. వైటీడీఏ చీఫ్‌ప్లానింగ్ ఆఫీసర్ ఏమాత్రం అంగీకరించడంలేదు.
తానే ప్రత్యేకంగా ప్లాన్లను గీస్తూ.. వాటికి అనుగుణంగా అయితేనే లేఅవుట్
అప్రూవల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో అటు ప్రజలు, ఇటు
డెవలపర్లు ఎంతోకొంతకు బేరమాడి, కాసులు సమర్పించి బయటపడుతున్నారు. వైటీడీఏ
చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అక్రమ వ్యవహారాలవల్ల.. లేఅవుట్ల అనుమతి కోసం ఎవరూ
ముందుకురాని దుస్థితి నెలకొన్నది. వైటీడీఏకు రావాల్సిన ఆదాయానికి
గండికొడుతూ వ్యక్తిగత ధనార్జనకే మొగ్గు చూపుతున్నారని డెవలపర్లు
విమర్శిస్తున్నారు. 2016 నుంచి ఈ ప్రాంతంలో వైటీడీఏ ఇచ్చిన అనుమతులు
తక్కువే ఉండటం గమనార్హం.
అక్రమంలోనూ తెలివిమంతులే..!
జీహెచ్‌ఎంసీ,
హెచ్‌ఎండీఏ వంటి సంస్థల్లో ఆర్కిటెక్ట్ గీసిన లేఅవుట్ ప్లాన్‌ను అనుమతి
కోసం డెవలపర్లు దరఖాస్తు చేస్తారు. ఈ దరఖాస్తు అటోమేటిగ్గా ప్రాసెస్
అవుతుంది. రోజూ కొన్ని వందల ఫైళ్లు ఈ విధంగా ప్రాసెస్ అవుతాయి. లేఅవుట్
అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. నేటికీ ఫైలుతోపాటు ఒక మనిషి ప్రత్యేకంగా
ప్రయాణించాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇలా చేయకపోతే, పదినెలలైనా అనుమతి
చేతికి రానేరాదు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అడిగినంత సొమ్ము ఇస్తేచాలు.. తుది
అనుమతి చేతిలోకి ఎగురుకుంటూ వస్తుంది. లేకుంటే, ఫైలు లూప్‌లో పడిపోవడం
ఖాయం. లేనిపోని కొర్రీల వల్ల.. ఆరు నుంచి పది టేబుళ్ల చుట్టూ అనుమతి ఫైలు
తిరుగుతుంది. రియల్టర్ సమర్పించిన ప్లాన్లు కరెక్టుగా లేవంటూ.. తామే
ప్లాన్లను గీస్తామని టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ సన్నాయినొక్కులు నొక్కుతారు.
వారి వ్యవహారం అర్థంచేసుకొని బేరమాడుకుంటే.. డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్
ప్రకారం లేఅవుట్ అనుమతి వస్తుంది. లేకపోతే, సెక్రటేరియట్ వద్దకు వెళ్లి
డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్ అనుమతి తెమ్మని తిప్పుతారు. ఈ తలనొప్పి
తమకెందుకని.. ఎంతో కొంత సొమ్ము ముట్టజెప్పేలా ఇక్కడి చీఫ్‌ప్లానింగ్ ఆఫీసర్
చాకచక్యంగా పావులు కదుపుతున్నారు.
జరిగేది మాత్రం ఇదీ..
కానీ,
వైటీడీఏలో మాత్రం ఇలాంటి ప్రాసెస్ అనుసరించే ప్రసక్తే ఉండదు. అనుమతి కోసం
దరఖాస్తు చేసిన తర్వాత చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తమ ప్రతాపాన్ని డెవలపర్ల మీద
చూపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలలో క్రమం తప్పకుండా ప్లాన్లను
గీసే ఆర్కిటెక్టులు ప్లాన్ ఇచ్చినా.. వైటీడీఏ చీఫ్‌ప్లానింగ్ ఆఫీసర్,
టౌన్‌ప్లానింగ్ ఆఫీసరే లేఅవుట్ డ్రాయింగులను కరెక్షన్లుచేస్తారు. ఆ సమయంలో
డెవలపర్ ఒప్పందం కుదుర్చుకున్నారా సరేసరి. లేకపోతే, లేఅవుట్ మ్యాప్‌లో
రోడ్లు, ఖాళీ స్థలాలు.. ఇలా ఏదో ఒక అంశంలో సతాయిస్తారు. ఇక ఆ ఫైలు.. ప్రతి
చిన్న అంశానికి పది సెక్షన్ల చుట్టూ తిరుగాల్సిందే. ఒక లేఅవుట్‌కు
సంబంధించి ఫీజు లెటర్ ఇవ్వాలా? అనే అంశమైనా.. డెవలపర్ నుంచి పేమెంట్
వచ్చిందా? అనే అంశమైనా సరే ఆ ఫైలు పది విభాగాల చుట్టూ తిరుగుతుంది.
అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే.. వైటీడీఏ టౌన్‌ప్లానింగ్ అఫీసర్లు..
ఒక్కొక్కసారి ఒక్కో షార్ట్‌ఫాల్ ఉందంటూ చెబుతారు. సైట్ తనిఖీకి సకాలంలో
రమ్మంటే రానేరారు.
నిబంధనల ప్రకారం ఇలా..
వైటీడీఏ
టౌన్‌ప్లానింగ్ విభాగం డీటీసీపీ ఆఫీసులో ఇన్‌వార్డ్‌లో లేఅవుట్ అనుమతి
కోసం దరఖాస్తుచేయగానే.. ఆ ఫైలు టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ వద్దకువెళ్లాలి.
డ్రాయింగ్ కరెక్షన్లు ఉంటే అక్కడేచేయాలి. ఆ తర్వాత సైట్ తనిఖీచేసి.. ఫైలు
ప్రాసెస్ అవ్వాలి. అనంతరం ఫీజులెటర్‌ను విడుదలచేస్తే.. ఆ సొమ్మును
చెల్లించి స్థలాన్ని మార్టిగేజ్ అయిన తర్వాత డ్రాఫ్ట్ లేఅవుట్ అనుమతి
ఇవ్వాలి. దీనిని తీసుకెళ్లి గ్రామపంచాయతీకి ఇస్తే సరిపోతుంది. రెరా అనుమతి
తీసుకున్నాక.. ప్లాట్ల అమ్మకాలను డెవలపర్లు ప్రారంభిస్తారు.
యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు
యాదాద్రి
భువనగిరి జిల్లా పరిధి రాయిగిరిలోని వడాయిగూడెంలో గల 518 సర్వే నంబర్‌లోని
400 ఎకరాల్లో ఇరవై ఎకరాల మేరకు భూదాన్ భూమి ఉన్నది. ఆ ఇరవై ఎకరాలు ఎక్కడో
తెలియక.. తెలుసుకోలేక.. మొత్తం 400 ఎకరాలను రెవెన్యూ అధికారులు
బ్లాక్‌లిస్టులో పెట్టారు. అదే అక్రమార్కులకు వరంగా మారింది. 400 ఎకరాల్లో
యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు వెలిశాయి.
తక్షణమే ఇవిచేయాలి..
-వైటీడీఏలోని టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళనచేయాలి.
-అనుమతుల ప్రక్రియను మొత్తం ఆన్‌లైన్ పరిధిలోకితేవాలి.
-ఇప్పటికే పేరుకుపోయిన పెండింగ్‌ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలి.
-అనుమతులను వేగంగా అందజేసే ప్రక్రియకు శ్రీకారంచుట్టాలి.
జీ కిషన్‌రావు, వీసీ/సీఈవో, వైటీడీఏ
నా దృష్టికి తీసుకొస్తే.. పరిష్కరిస్తాం
వైటీడీఏ
పరిధిలో లేఅవుట్లకు అనుమతులను డీటీసీపీ మంజూరు చేస్తున్నది. అయితే,
వైటీడీఏ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తూ.. నిబంధనల పేరిట
అనుమతులు ఆలస్యం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరైనా ఇబ్బందులు
పడుతుంటే నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తాం. అనుమతుల్లో
ఆలస్యాన్ని నిరోధించి.. వీలైనంత త్వరగా ఇచ్చేందుకు కృషిచేస్తాం.
- జీ కిషన్‌రావు, వీసీ/సీఈవో, వైటీడీఏ
Read more...