తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలు, పాలనను అధ్యయనం చేసేందుకు యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి భవాని శంకర్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారుల బృందం తిరుమల తిరుపతి దేవస్థానమును సందర్శించారు.
శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలు, పాలనను అధ్యయనం చేసేందుకు యాదగిరిగుట్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో జే. భవానీ శంకర్, ఏఈవో జీ.రఘు, సూపరింటెండెంట్ లు ఎం. రాజన్ బాబు, డి.నరేష్ లతో కూడిన బృందం గురువారం తిరుమల లోని శ్వేత భవనంలో టిటిడి అధికారులతో సమావేశం లో పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వాహణాధికారి శ్రీ వెంకయ్య చౌదరి గారితో సమావేశమై, తిరుమల తిరుపతి దేవస్థానంలో దాత లకు కల్పించబడుచున్న సదుపాయాలు డోనార్ ఫెసిలిటీ సెంటర్ మరియు విచ్చేయు భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించుటలో టీటీడీ అవలంబిస్తున్న విధానాలను పరిశీలించారు.
శ్వేతా భవనంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ శరత్ గారి ఆధ్వర్యంలో టీటీడీ సమగ్ర కార్యకలాపాలపై జీఎం (ఐటీ) శ్రీ బి. వేంకటేశ్వర నాయుడు సమగ్ర వివరణ ఇచ్చారు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాలు వితరణ, కళ్యాణ కట్ట, క్యూలైన్లు నిర్వహణ, వసతి, ఐటీ, వివిధ ట్రస్ట్ లు, ధార్మిక కార్యక్రమాలు, విద్యాసంస్థల నిర్వహణ, వైద్య సేవలు, శ్రీవారి సేవలు, విజిలెన్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, కంపార్ట్మెంట్ ల నిర్వహణ, కమాండ్ కంట్రోల్ సెంటర్, పారిశుధ్యం, పచ్చదనం, గోశాల, ప్రసాదాల తయారీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం టీటీడీ బోర్డు సమావేశాలు, అజెండాల తయారీ, తీర్మానాలు, మినిట్స్, వెబ్ సైట్ లో పొందు పరచడం, బోర్డు కార్యకలాపాలు, బోర్డు చట్టాలు, ఎండోమెంట్ చట్టం తదితర అంశాలపై డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి గారు వివరించారు.
ఈ సందర్భంగా ప్రారంభ సమావేశంలో డైరెక్టర్ డా. వేమా వెంకటరత్నం మాట్లాడుతూ, శ్వేతా సంస్థ 2002లో స్థాపించబడిందని, అప్పటి నుంచి టీటీడీ ఉద్యోగులకు సేవా దృక్పథం, పరిపాలన, సనాతన ధర్మ ప్రచారం, ఆలయ నిర్వహణ అర్చకులు, పోటు సిబ్బంది, ఇతర సంప్రదాయ సేవలు,
ఆఫీస్ మేనేజ్‌మెంట్, డ్రాఫ్టింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఈ-ఆఫీస్, మహిళల రక్షణ చట్టాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఆధునిక అంశాలపై సిబ్బందికి నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్వేత ఏఈవో శ్రీమతి అరుణా దేవి, బోర్డు సెల్ ఏఈవో సుశీల, డిపిపి ఏఈవో సత్యనారాయణ, సూపరింటెండెంట్ సుశీల, మల్లిశ్వరి, సూపరింటెండెంట్ చెంగల్ రాయులు, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.




Comments
Post a Comment
Please visit again to this site, will be replied your comment shortly