ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ట్రస్ట్ బోర్డును నియమించింది (GO RT No. 392, Dated 30.6.2026). బోర్డులో వివిధ ప్రాంతాలకు చెందిన సభ్యులకు చోటు కల్పించినప్పటికీ, స్థానికులకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాల ప్రతినిధులు, భక్తులు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విషయంలో స్థానికుల అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని, అయినప్పటికీ ట్రస్ట్ బోర్డులో వారికి తగిన స్థానం కల్పించకపోవడం, కనీసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఎవరికి స్థానం కల్పించక పోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
యాదగిరిగుట్ట వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో స్థానికుల భాగస్వామ్యం మరింత అవసరమని వారు పేర్కొంటున్నారు. ఆలయానికి సంబంధించిన పలు సమస్యలు, భక్తుల అవసరాలు, స్థానిక పరిస్థితుల, బౌగోళిక స్థితుల పై అవగాహన ఉన్న వారిని ట్రస్ట్ బోర్డులో చేర్చి ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉండేదని అంటున్నారు.
రెవెన్యూ (దేవాదాయ శాఖ.I) డిపార్ట్‌మెంట్ – యాదగిరిగుట్ట దేవస్థానం (YTD) – తెలంగాణ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ (సవరణ) చట్టం, 2025 లోని సెక్షన్ 96 ప్రకారం యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు లో ఈ క్రింద తెలిపిన వారికి స్థానం కల్పించారు, వీరి పాలన వచ్చే రెండు సంవత్సరాల వరకు ఉంటుంది.
1. శ్రీ ఎం. సత్యనారాయణ రెడ్డి - *ఛైర్మన్*
2. శ్రీ వినోద్ వెంకటస్వామి, ఎమ్మెల్యే - *సభ్యుడు*
3. శ్రీమతి కొణిదెల సురేఖ - *సభ్యురాలు*
4. శ్రీమతి చిలప్పగారి విజయరాజం - *సభ్యురాలు*
5. శ్రీ విజయేందర్ తుల్లా - *సభ్యుడు*
6. శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ - *సభ్యురాలు*
7. శ్రీ గుండు మల్లయ్య - *సభ్యుడు*
8. శ్రీమతి స్వాతి కంతమణి - *సభ్యురాలు*
9. శ్రీ ఎం. రాఘవేందర్ రావు - *సభ్యుడు*
10. డా. లక్ష్మీనారాయణ నాయక్ - *సభ్యుడు*
11. ది ఫౌండర్ ట్రస్టీ - *సభ్యుడు*
12. చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
13. ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, రెవెన్యూ (దేవాదాయ) శాఖ, తెలంగాణ ప్రభుత్వం - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
14. కమీషనర్, దేవాదాయ శాఖ, తెలంగాణ, హైదరాబాద్ - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
15. జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
16. వైస్ ఛైర్మన్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
17. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, యాదగిరిగుట్ట దేవస్థానం - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
18. స్థానాచార్యులు లేదా సీనియర్-మోస్ట్ ప్రధాన అర్చకులు - *ఎక్స్-అఫీషియో సభ్యుడు*
Yadagirigutta Trust Board, #YTD #YTDA #yadagirigutta #yadadri #revanthreddy #kcr
0 comments:
Post a Comment