Yadagirigutta Main Road needs Redesign | యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డు రీడిజైన్ కావాలా !?

  • యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డు రీడిసైన్ కావాలా?
  • అసంపూర్తిగా నిలిచిన రోడ్డు విస్తరణ
  • వరద నీటికి / మురుగు నీటికి దారేది?
  • పార్కింగ్ స్థలమేది? పాద చారులకు దారేది?

ఎన్నో ఏళ్ళు గా విస్తరణ కు నోచుకోని యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డు, తెలంగాణా వచ్చిన తరువాత, యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం అయి, ప్రారంబోత్సవం తేది సమీపిస్తున్న వేళా ఆగం ఆగం గా రోడ్డు విస్తరణ మొదలు పెట్టి కేవలం పాతగుట్ట రోడ్డు వరకు మాత్రమే, గత ప్రభుత్వం లో పూర్తీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. కోర్టు కేసు, తదితర కారణాల వలన అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అప్పటి కప్పుడు కొత్త ప్లానులు గీసి, పనులను అసంపూర్తిగా చేసారు.  మారిన ప్లాను ప్రకారం మెయిన్ రోడ్డు లో ఒక బ్రిడ్జి, ఒక అండర్ పాస్, ఊరు మద్యలో ఒక అడ్డుగోడ మొలిచింది.

2023 ఎన్నికల ప్రచారంలో,  ప్రస్తుత ఆలేరు ఎం ఎల్ ఎ బీర్ల అయిలయ్య ఈ బ్రిడ్జిని తీసివేయిస్తానని మాట ఇచ్చారు, మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల సమయంలో కూడా, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎం ఎల్ ఎ బీర్ల అయిలయ్య మరోసారి ఈ బ్రిడ్జిని తీసివేయిస్తామని మాటిచ్చారు. ఆ మాట కు కట్టుబడి ఆ బ్రిడ్జిని తీయించే పనులు మొదలు పెడుతునట్టు ఈ రోజు వైకుంఠ ద్వారం దగ్గర ప్రకటించగానే అక్కడ గుమికూడిన ప్రజలు జయ జయ నినాదాలు చేస్తూ, హర్షాతిరేకం ప్రకటించారు.

అసంపూర్తిగా నిలిచిన రోడ్డు విస్తరణ:

గత ప్రభుత్వం వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట రోడ్డు వరకే రోడ్డు విస్తరణ చేసింది, ప్రజల ఆస్తులను సేకరించి, రోడ్డు నిర్మాణం చేసారు కాని, పాతగుట్ట రోడ్డు నుంచి గుండ్లపల్లి నాల వరకు ఇరువైపులా ప్రభుత్వ ఆస్తులు ఉన్న వాటిని ముట్టుకోలేదు, రోడ్డు విస్తరణ చేయలేదు, దీంతో కొందరు, ఇరువైపులా రోడ్డును ఆక్రమించి రేకుల సేడ్డులు వేసి రోడ్డును కుదించే  ప్రయత్నం చేసారు, ఈ మధ్యే మునిసిపల్ అధికారులు వారిని హెచ్చరించి వెనుకకు జరిపించారు, కాని షరా మామూలే, మల్లి కొందరు ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనిని అరి కట్టాలంటే పాతగుట్ట రోడ్డు నుంచి వడాయి గూడెం, రాయగిరి చెరువు వరకు ఇరువైపులా రోడ్డు విస్తరణ పూర్తీ చేయాలనీ స్థానికులు కోరుకుంటున్నారు. బస్టాండ్ నాల నుంచి రాయగిరి చెరువు వరకు ఉన్న నిర్మాణాల సర్వే, మార్కింగ్ కూడా పూర్తీ చేసి, కొంతమందికి నష్ట పరిహారం కూడా ఇచినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు.  సర్వీస్ రోడ్డు కోసం కేటాయించిన స్థలాలను కొందరు యదేచ్చాగ్గా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్టు, కబ్జాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రోడ్డు విస్తరణ పూర్తీ అయితే ఈ సమస్యలన్నీ తీరుతాయని ప్రజలు అనుకుంటున్నారు.


వరద నీటికి / మురుగు నీటికి దారేది? 

వైకుంఠ ద్వారం నుంచి పాత గుట్ట రోడ్డు వరకే రోడ్డు విస్తరణ జరిగినట్టే, వరద కాలువ పనులు, మురుగు కాలువ పనులు కూడా పాతగుట్ట రోడ్డు వరకే జరిగాయి, తరుచుగా మురికి నీరు రోడ్డు మీద పారడం, వానొస్తే కొండపైనుంచి వచ్చే నీరు పోవడానికి దారిలేక రోడ్ల పైనుంచే వెళ్ళడం జరుగుంది, భారీ వర్షం కురిసిన రోజు కొండపైనుంచి వచ్చే నీరు వెళ్ళే దారి లేక హనుమాన్ దేవాలయం అండర్ పాస్ నుంచి వరదలా పారి శివాజీ నగర్, గాంధీ నగర్ ప్రాంతాలని  ముంచెత్తుతుంది. రోడ్డు ప్రక్కన కట్టిన డ్రెయిన్ కూడా మూసివేసి ఉండడంతో నీరంతా రోడ్డు మీదే పారుతుంది, పెండింగ్ లో ఉన్న ఈ మురికి కాలువల పనులు కూడా వెంటనే మొదలు పెట్టి, వైకుంఠ ద్వారం నుంచి, బస్టాండ్ నాల వరకు పూర్తీ చేయాలనీ స్థానికులు కోరుతున్నారు.

పార్కింగ్ స్థలమేది? పాద చారులకు దారేది? 

యాదగిరిగుట్ట యాత్ర స్థలం, రోజు స్వామి వారిని దర్శనం కొరకు వచ్చే భక్తులకు, యాత్రికులకు రోడ్డు ప్రక్కనే నడిచేందుకు ఫుట్ పాత్ లేదు, ఒక పది నిముషాలు వాహనాలు ఆపి షాపింగ్ చేసుకుందమన్న రోడ్డు ప్రక్క పార్కింగ్ స్థలం లేదు, తెలిసో తెలియకో ఆపితే ట్రాఫిక్ చలాన్ లు కట్టాల్సి వస్తుందని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడు బ్రిడ్జి ని తీసే ఆలోచన లో ఉన్నారు కాబట్టి, యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డును రీడిజైన్ చేసి, ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డును కలుపుకుని, రోడ్డు ప్రక్కన పార్కింగ్, మరియు ఫుట్ పాత్ నిర్మాణాలు, వైకుంఠ ద్వారం నుంచి సురేంద్ర పూరి వరకు ఇరువైపులా నిర్మించాలని, స్థానికులకు, యాత్రికులకు ఇది సౌకర్యవంతంగా ఉండడం తో పాటు యాదగిరిగుట్ట కు ఒక కొత్త దృశ్యం ఆవిష్కృత మౌతుందని స్థానికులు, భక్తులు అభిప్రాయ పడుతున్నారు. భువనగిరి పట్టణంలో రోడ్డు విస్తరణ ఇదే మాదిరిగా, రోడ్డు ప్రక్కన పార్కింగ్, ఫుట్ పాత్ లు నిర్మించిన సందర్బాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు.  

#yadagirigutta #yadadri #slnsdevastanam #yadadriringroad

Comments