Friday, August 30, 2024
Sunday, May 19, 2024
Yadadri needs new steps way at North Side!!? | యాదాద్రి ఉత్తరాన మెట్ల దారి కావాలా !!?
➽ కొండపైకి సరిపడా బస్సులు లేవు
➽ కారులో వెలుదామంటే ఘాట్ రోడ్డు దగ్గర నిరీక్షణ
➽ కారు పార్క్ చేసి నడిచి వెళదామన్న మెట్ల దారి లేదు.
ఒక లక్ష మంది భక్తులు యాదగిరిగుట్ట కు
దర్శనానికి వస్తే ఎలా? వారికి కావలసిన సౌకర్యాలు, ముఖ్యంగా వ్యక్తిగత వాహనాల రద్దీ,
తెలంగాణ లోని ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సులు మొదలు పెట్టడడం, పట్టణంలోని
రహదారులు విస్తరించడం తదితర బృహత్తర మాస్టార్ ప్లాన్ తో మొదలైనదే యాదగిరిగుట్ట ఆలయ
పునర్నిర్మాణం. భక్తుల సౌకర్యాల కోసం దాదాపు
1200 ఎకరాల సేకరణ, వాటిలో ఆలయానికి సంబంధించిన వివిద కొత్త నిర్మాణాలు. పెరిగే భక్తుల
రద్దీ ని తట్టుకోవడానికే ఆలయ విస్తరణ చేయడంతో కొండపైన స్థలం కుదించుకు పోయింది. అన్నీ
సౌకర్యాలు కొండమీద కలిపించడం సాద్యం కాదనే కొండ క్రింద, క్రొత్తగా కళ్యాణ కట్ట, పుష్కరిణి,
అన్నదాన సత్రం, వ్రత మండపం, యాదాద్రి బస్టాండ్, YTDA బస్టాండ్, శాంపిగ్
కాంప్లెక్స్, 3 వ ఘాట్ రోడ్డు, వాహనాల పార్కింగ్, తదితరాలు నిర్మాణాలు చేపట్టారు, అయితే
వీటిలో చాలా పనులు ఇంకా పూర్తి కాలేదు.
కొండ మీద సరిపడా స్థలం లేదనే ఆలయ పునః
ప్రారంభం తరువాత అప్పటి అధికారులు అన్నీ రకాల వాహనాలను కొండపైకి నిషేదించి, భక్తుల
కు కొండ క్రింది నుంచి కొండ మీదికి తీసుకు వెళ్ళడానికి ఉచిత బస్సులు మొదలు పెట్టారు.
అయితే రద్దీ రోజులలో సరిపడా బస్సులు లేక పోవడం, ఆటోలు కూడా కొండ మీదికి నడవకపోవడం తో
భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగత వాహనాల ద్వారా వచ్చే భక్తుల డిమాండ్, వివిద
వర్గాల ప్రజల విన్నపాలతో నాలుగు చక్రాల వాహనాలకు 500/- పార్కింగ్ రుసుం తో కొండ పైకి
అనుమతించడం మొదలుపెట్టారు. కొండమీద సరిపడా స్థలం లేదనేది అందరికీ తెలిసిన సత్యం. ప్రస్తుతం బస్సుల కోసం ఏర్పాటు చేసిన బస్టాండ్ ని
పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. ప్రయాణికులకోసం ఏర్పాటు చేసిన ప్లాట్ ఫారాలు షాపింగ్
కాంప్లెక్స్ గా మారి పోయాయి. కొండ మీద ఒక్క దుకాణం కూడా ఉండదన్న గత ముఖ్యమంత్రి మాటలను
భేఖాతారు చేస్తూ ఇదే బస్టాండ్ లో దుకాణాలు వెలిసాయి. పార్కింగ్ స్థలంలో టాయిలెట్ కడుతున్నారు,
కొండపై ఉన్న కాసింత పార్కు స్థలాన్ని పార్కింగ్ స్థలంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
అధికారులు కాసింత పార్కింగ్ స్థలం పెంచినంత మాత్రాన వాహనాల రద్దీ తగ్గిపోతుందా అని
స్థానికులు అనుమానం వ్యక్తపరస్తున్నారు.
తాత్కాలిక నిర్మాణాలతో కాలం వెళ్లదీయలని
ఆలోచించే అధికార్లు, ఒకసారి వారి మాస్టర్ ప్లాన్ ముందు వేసుకొని ప్లాన్ ప్రకారం ముందుకు
వెళ్లాల్సిన అవసరముందని, కొండక్రింద మద్యలోనే ఆగిపోయిన YTDA బస్టాండ్, షాపింగ్
కాంప్లెక్స్, పార్కింగ్ స్థలం విస్తరణ, రద్దీ రోజులలో మరిన్ని బస్సులను కొండపైకి నడపడంతో
పాటు, హైదరాబాద్ నుంచి కొండ మీది వరకు నేరుగా బస్సులను నడపడం తదితర చర్యలు తీసుకోవలసిన
అవసరముందని భక్తులు, స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర దిక్కున కొండపైకి వెళ్ళడానికి మెట్ల దారి లేదు, ప్రస్తుతం దేవాలయానికి సంబంధించిన ప్రదాన సేవలు లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్ట, అన్నదానం, సత్యనారానాయణ వ్రతాలు, వాహనాల పార్కింగ్, కొత్త బస్టాండ్, దుకాణాల సముదాయం, వాహన పూజాలు అన్నీ ఇటు వైపే ఉన్నాయి, కానీ భక్తులు ఇటునుంచి కొండ పైకి వెళ్లాలంటే ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏమి లేదు. స్వంత వాహనాలు ఉన్నవారు వస్తే, పైన ఫోటోలో చూపించించినట్టు రద్దీ రోజులలో కొండ మీదికి ఎంట్రీ కోసం గంటల తరబడి ఘాట్ రోడ్డు వద్ద వేచి చూసే ఇబ్బందులు ఉన్నాయి. వాహనాలను పార్క్ చేసి వెలుదామన్న సరిపడా బస్సులు ఉండవు, ఈ రద్దీ లను దృష్టిలో ఉంచుకొని వ్రత మండపము ప్రక్కనుంచి కొండపైకి కొత్త మెట్ల దారి నిర్మించి భక్తులు తమ ఇష్టానుసారంగా కొండపైకి వెళ్ళి వచ్చే విదంగా ఉండాలని స్థానికులు, భక్తులు కోరుకుంటున్నారు.
జానీ మహమ్మద్
https://www.youtube.com/manayadadri
Read more...Sunday, May 5, 2024
Raigir Kaman History | రాయగిరి కమాన్ చరిత్ర
రాయగిరి కమాన్ చరిత్ర.
హైదరబాద్ - వరంగల్ హైవే నుంచి వెళుతునప్పుడు, యాదగిరిగుట్టకు రమ్మని స్వాగతం పలుకుతూ ఒక కమాన్ (వైకుంఠద్వారం) రాయగిరి దగ్గర ఠీవిగా దర్శనమిస్తుంది. కాసేపు ఆగి చూస్తే దాని చరిత్ర తెలుస్తుంది.
Friday, March 8, 2024
Bhongir Fort Development Foundation by PM Modi | భువనగిరి కోట దశ మారనుందా !!
భువనగిరి దశ మారనుందా!!
► 118 కోట్ల తో భువనగిరి కోటకు కొత్త హంగులు
► మొదటి విడత 69 కోట్ల కేటాయింపు
► కోట మీదికి రోప్ వే, లిఫ్టులు
► పచ్చని పార్కులు, నీటి కొలనులు, జలపాతాలు
► టూరిస్టులకు వసతులు, సాహస క్రీడలు
హైదరాబాదు కు అతి దగ్గరలో, రోడ్డు రైలు సౌకర్యాలతో ప్రపంచంలోనే ఏకశిల పై అతి ఎతైన ప్రదేశంలో ఉన్న భువనగిరి చారిత్రక కోట, సరి అయిన వసతులులేక, గత కొన్ని దశాబ్దాలుగా జరగాల్సినంత అబివృద్ది జరగలేదు, ప్రఖ్యాతి పొందలేదు. ప్రభుత్వాలు మారినపుడల్లా అభివృద్ది ఫైళ్ళు కదిలేవీ, సర్వేలు జరిగేవి, మళ్ళీ మూలాన పడేవి.
ఇన్నాళ్ళకు కేంద్ర ప్రభుత్వం “స్వదేశీ దర్శన్” 2.0 స్కీమ్ లోచేర్చింది. నిన్న మన ప్రధాని నరేంద్ర మోడి గారు కాశ్మీర్ నుంచి వర్చువల్ గా ఈ ప్రాజెక్టు కు శంకుస్థాన చేశారు. ఇక్కడి ప్రాంతావాసుల చిరకాల కోరిక మరి కొన్ని రోజులలో తీరబోతున్నది. ఈ ప్రాజెక్టు ను రానున్న 24 నెలలో పూర్తి చేయాలని నిర్ణయినంచినట్టు తెలుస్తుంది.
భువనగిరి ఖిలా దాదాపు 147 ఎకరాల్లో విస్తరించి, 610 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. దీనిని ఎక్కి చూడడానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉంది, అది కూడా చాలా చోట్ల శిథిలవస్తాలో ప్రమాదకరంగా ఉంటుంది. అభివృద్ది లో భాగంగా కోడపైకి మెట్ల మార్గాన్ని అభివృద్ది చేయడం తో పాటు, వరంగల్ హైవే వైపునుంచి నుంచి కొండ మీది కి రోప్ వే ఏర్పాటు చేస్తారు, అలాగే కొండకు అనుకొని పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఏర్పాటు చేస్తారు. అన్నీ వయసుల వారు కొండ మీది కి వెళ్ళే అవకాశం వస్తుంది. వరంగల్ హైవే నుంచి కొండవరకు విశాలమైన రోడ్లు, రోప్ స్టేషన్, పార్కింగ్, వసతులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. కొండపైన పార్కులు, నీటి కొలనులు, కృత్రిమ జలపాతాలు నిర్మిస్తారు. పర్యటకులకోసం సాహస క్రీడలు, రాప్పెలింగ్, రాక్ ైక్లెంబింగ్, హైకింగ్, వాల్ ైక్లెంబింగ్ ఏర్పాటు చేస్తారు, కొండ చుట్టూరా వాకింగ్ ట్రాక్ కూడా నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి.
పైవన్నీ పూర్తయితే భువనగిరి కోట ఒక అద్బుత పర్యాటక ప్రదేశం గా వెలుగుపొతుంది, గతంలో చెప్పినట్టు భువనగిరి, యాదాద్రి, కొలనుపాక ను ఒక పర్యాటక సర్క్యూట్ గా ఏర్పాటు చేస్తే, పర్యటకంగా ఈ ప్రాంతం అభివృద్ది పొన్నడడంతో పాటు, ఇక్కడి ప్రజల అభివృద్ది కి కొత్త దారులు పడినట్టే. పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
జానీ మహమ్మద్
https://youtube.com/manayadadri
#Bhongir #BhongirFort #Ropeway #Modi #India #Telangana #yadadri #SwadeshDarshan2.0
Monday, February 19, 2024
Yadadri Special Cover by India Post | యాదాద్రి స్పెషల్ కవర్ ఇండియా పోస్టు ద్వారా
#yadadri #yadagirigutta #yadadritemple #yadadricover
Friday, February 2, 2024
Yadadri MMTS Delayed | సారి ... మరో సారి మొండి చెయ్యే! | యాదాద్రి MMTS మరింత ఆలస్యం
ప్రయాణికులకు గమనిక .. కృపయా ధ్యాన్ దిజియే .. యు ఆర్ అటెన్షన్ ప్లీజ్ .. సికిందరాబాద్ నుంచి యాదాద్రి వెల్లవలసిన MMTS ఎప్పుడు వస్తుందో తెలియదు .. ప్రస్తుతం 7 సంవత్సరాలు ఆలస్యంగా నడుస్తుంది. అవును, యాదాద్రి MMTS గురించి చెప్పుకోవలంటే, ఇలాగే చెప్పుకోవాలి.
2017 లో 412 కోట్ల అంచనా తో ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు పనులు మొదలుకాలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు సమకూర్చాలని కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ఇంతవరకు ఇరువురు సరిఅయిన నిధులు ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదు. మారిన ప్రభుత్వాలతో భవిష్యత్ లో ఏం జరగనుందో ఎవరు ప్రస్తుతానికి ఊహించే పరిస్థితిలేదు. ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవతున్నకొద్ది ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతూ పోతుంది. 412 కోట్లు అనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 1500 కోట్ల వరకు వెల్ల వచ్చని పరిశీలకులు అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలు గా కేవలం సాలిన 10 లక్షలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయనిదే ఈ ప్రాజెట్ పూర్తి కావడం అసంభవం. ప్రజల కోసం అన్నీ చేస్తున్న అని చెప్పే పాలకులు నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభించక పోవడం, ఈ ప్రాంత అభివృద్దిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
#yadadri #yadagirigutta #mmts
Read more...