Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Thursday, September 17, 2020

New Office Building for Yadagirigutta Municipality

Yadagirigutta Municipal Chairman, Counselors and Co-option Members along with Alair MLA Smt Gongidi Sunitha Mahender Reddy met with Telangana State Municipal Minister K Taraka Ramarao and Endowment Minister Indrakaran Reddy today. Yadagirigutta Municipality requested them to Releasing of 30% recurring amount from the SLNS Devasthanam, which has been paid by devasthanam when yadagirigutta was Grampanchayath, Since Yadagirigutta becomes Municipality this amount has been not released by Department. accordingly, Municipal members requested to the Ministers for the same and they assured to release the amount. in this meeting Minister KTR announced to Plan a New Municipality Office building for Yadagirigutta inline with development of Yadadri Temple. 

యాదగిరిగుట్ట మున్సిపాలిటి కార్యలయనికి నూతన భవనం : #KTR

మున్సిపల్ భవనం అద్భుతంగా ఉండాలి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మహాద్భుత క్షేత్రంగా రూపుదాల్చుతున్న తరుణంలో.. ఆ నిర్మాణాలకు అనుగుణంగా.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కొండ దిగువన యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్చర్ ను సంప్రదించి అద్భుతమైన డిజైన్ తయారు చేయించాలని సూచించారు. ఈ నిర్మాణ విషయంలో నిధులు తక్షణమే మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత లక్షలాది భక్తులు యాదాద్రికి తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం వందలాది మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు. 

 
గుట్ట మున్సిపల్ కు 30 శాతం రికరింగ్ సొమ్మును యాదాద్రి దేవస్థానం చెల్లించాల్సిందే 
  • . దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ను ఆదేశించిన మంత్రి కేటీఆర్
  • . మున్సిపల్ నూతన భవనాన్ని అద్భతంగా నిర్మించండి
  • . నిరంతరం కష్టపడే గొంగిడి సునీతామహేందర్రెడ్డి మీ ఎమ్మెల్యే కావడం అదృష్టం
  • . యాదగిరిగుట్ట మున్సిపల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో మంత్రి కేటీఆర్ 

మౌళిక సదుపాయాల కల్పన నిమిత్తం గతంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి యాదగిరిగుట్ట మేజర్ గ్రామ పంచాయితీకి ఇచ్చిన మాదిరిగానే.. ప్రస్తుత మున్సిపల్ కు కూడా 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్ ను చెల్లించాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను గురువారం మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గతంలో మాదిరిగానే యాదాద్రి మున్సిపల్ కు 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్ ను చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ విప్, ఆలేరు MLA గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సుమారు అరగంట పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్ ను ఇచ్చే విధంగా తక్షణమే ప్రత్యేక జీవో ను విడుదల చేయాలని కమిషనర్ అనిల్ కుమార్ ను మంత్రి ఆదేశించారు.
<><><>

ఆలేరు నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వ విప్, MLA గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అహర్నిశలు శ్రామిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. ఇలాంటి MLA దొరకడం మీ అదృష్టం.. ఆమె సేవలను వినియోగించుకోండి అంటూ కేటిఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు బూడిద సురేందర్, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, రిజ్వానా, సయ్యద్ బాబా, పేరబోయిన పెంటయ్య, నాయకులు ఎరుకల హేమేందర్ గౌడ్ తదితరులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.

Read more...

Sunday, September 13, 2020

CM KCR Yadadri Visit 13-09-2020

ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అనేక ఏళ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం కాబట్టి ఎక్కడా తొందరపాటు లేకుండా, తొట్రుపాటు లేకుండా, సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరగాలని ఆదేశించారు. స్వామివారికి వివిధ రకాల సేవలు, పూజలు చేసే విషయంలో, భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సీఎం చెప్పారు. ఆలయ నిర్మాణ పనులు అత్యంత సుందరంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 6 గంటలపాటు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. 

 

యాద్రాద్రి ఆలయానికి రింగు రోడ్డు సుందరీకరణ ఒక మణిహారంలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. పచ్చని చెట్లు, వీధి దీపాలతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లతో రింగ్ రోడ్డును అత్యంత సుందరంగా తయారుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అన్ని నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. ఆలయానికి ఆనుకుని ఉన్న గండిపేట చెరువును ప్రతి రెండు నెలలకు ఒకసారి కాళేశ్వరం జలాలతో నింపాలని ఆదేశించారు. ఆలయం పరిసరాలు, టెంపుల్ సిటీ నిర్మాణం అద్భుతమైన పచ్చదనంతో నిండి ఉండాలని, ఇందుకోసం చెట్లను ఎక్కువగా పెంచాలన్నారు. స్పెషల్ ఆర్కిటెక్ట్ లను పిలిపించి గండిపేట చెరువు ప్రాంతాన్ని అందమైన స్పాట్ గా తీర్చిదిద్దాలని సీఎం కోరారు.
 
యాదాద్రి టెంపుల్ సిటీలో 365 క్వార్టర్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మరో 200 ఎకరాల్లో కాటేజీల
నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కళ్యాణ కట్ట, బస్టాండ్, పుష్కరిణి రెయిలింగ్, రహదారుల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆర్ అండ్ బీ ఈ.ఎన్.సీకి సూచించారు. బస్టాండ్ నుంచి గుడి వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ద్వారాలకు బంగారు తాపడం చేయడానికి పెంబర్తి నుండి నిపుణులైన స్వర్ణకారులను పిలిపించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల కోసం మూడు వారాల్లో రూ.75 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఫోన్లో ఆదేశించారు.
 
సత్యనారాయణ స్వామి వ్రతాలకు యాదాద్రి ప్రసిద్ధి అనీ, ఒకేసారి నాలుగు వేల మంది వ్రతం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అన్నారు. ఆలయం, టెంపుల్ సిటీ నుంచి డ్రైనేజీ నీళ్లను బయటకు పంపడానికి ప్రత్యేక నిర్మాణాలు చేయాలని కోరారు. 5 వేల కార్లు, 10 వేల బైకుల కోసం పార్కింగ్ ను సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
హరిత గెస్ట్ హౌస్ లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీ జి. జగదీశ్ రెడ్డి, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ భూపతిరెడ్డి, కలెక్టర్
శ్రీమతి అనితా రామచంద్రన్, సీఎంఓ అధికారి శ్రీ భూపాల్ రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ శ్రీ కిషన్ రావు, ఆలయ ఈఓ శ్రీమతి గీత, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు శ్రీ గణపతి రెడ్డి, శ్రీ రవీందర్ రావు, ఆర్కిటెక్ట్ శ్రీ ఆనంద్ సాయి, స్తపతి డాక్టర్ వేలు, టూరిజం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
Chief Minister Sri K. Chandrashekar Rao desired that the Yadadri Sri Laxmi Narasimha Swamy Temple Complex should be made to reflect and highlight the spirituality and pleasure. The CM instructed that since the Temple Complex should continue to exist for several years to come, the renovation works should b
e done without any hurry or lapses and by strictly following the Agama Sastra guidelines, traditions. The CM said the infrastructure facilities should be created taking a special interest in several poojas, services conducted for the presiding deity, and the facilities for the devotees visiting the temple. He also instructed the officials concerned to ensure that the construction works epitomize beauty.
The CM who visited the Yadadri Temple Complex on Sunday afternoon had darshan of Sri Laxmi Narasimha Swamy and offered special poojas. The CM inspected the temple renovation works for about 6 hours. 
 
The CM suggested that the Temple Ring Road should be developed like a Necklace. He wanted provisions should be made for walking and cycling tracks, greenery, and illumination along the Ring Road. The CM wanted that the entire infrastructure should be made in such a way that the visiting devotees whatever great their number be should have a comfortable darshan and stay. He instructed that the Gandipet Tank adjacent to the Temple Complex should be filled with water every two months by drawing water from the Kaleswaram. He said the entire Temple Town, Temple Complex should have greenery in abundance and for this purpose, more trees should be grown in the area. He said special Architects should be entrusted with the job beautifying the Gandipet Tank and its periphery area as a tourist spot. 
 
The CM also wanted works on the construction of 365 Quarters should be completed speedily. He suggested Cottages should be constructed in another 200 Acres. He also instructed the officials to complete as quickly as possible the
 
construction of Kalyana Katta, Bus Stand, Pushkarini Railing, and roads. The CM instructed the R&B E-in-C to remove Contractors who are not doing the works as per schedule. He wanted the RTC officials to provide free bus service to the devotees from the Bus Stand to the Temple. The CM also suggested that the specialist goldsmiths from Pembarthy should be engaged to provide Gold Cover to the Temple Tower (Rajagopuram) and the Main Gates. The CM instructed Principal secretary (Finance) Sri Ramakrishna Rao over the phone to release in the next three weeks Rs 75 Crore for the temple works. 
 
CM KCR said that Yadadri was famous for Satyanarayana Swamy Vratham and hence provision and facilities should be made in the temple to make 4000 people perform the Satyanarayana Swamy Vratham at one go. He wanted special constructions should be made to let the drainage water from the Temple, Temple city flow out of the city. Parking lots should be developed and created in such a way that they should accommodate 5,000 Cars and 10,000 Two-wheelers. 
 
In the review meeting held at Haritha Guest House by CM, Minister Sri G Jagdish Reddy, MP Sri Joginapalli Santosh Kumar, Government Whip Ms. Gongadi Sunitha Mahender Reddy, MLA Sri Pailla Shekar Reddy, MLA Sri Alimineti Krishna Reddy, ZP Chairman Sri Alimineti Sandeep Reddy, Tourism Development Corporation Chairman Sri Bhoopathy Reddy, Collector Ms. Anita Ramachandran, CMO Official Sri Bhoopal Reddy, YTDA Special Officer Sri Kishan Rao, Temple EO Ms. Geeta, R&B E-in-Cs Sri Ganapathi Reddy, Sri Ravinder Rao, Architect Sri Ananda Sai, Sathapathy Dr. Velu and others participated.

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP