New Office Building for Yadagirigutta Municipality
Yadagirigutta Municipal Chairman, Counselors and Co-option Members along with Alair MLA Smt Gongidi Sunitha Mahender Reddy met with Telangana State Municipal Minister K Taraka Ramarao and Endowment Minister Indrakaran Reddy today. Yadagirigutta Municipality requested them to Releasing of 30% recurring amount from the SLNS Devasthanam, which has been paid by devasthanam when yadagirigutta was Grampanchayath, Since Yadagirigutta becomes Municipality this amount has been not released by Department. accordingly, Municipal members requested to the Ministers for the same and they assured to release the amount. in this meeting Minister KTR announced to Plan a New Municipality Office building for Yadagirigutta inline with development of Yadadri Temple.
యాదగిరిగుట్ట మున్సిపాలిటి కార్యలయనికి నూతన భవనం : #KTR
మున్సిపల్ భవనం అద్భుతంగా ఉండాలి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మహాద్భుత క్షేత్రంగా రూపుదాల్చుతున్న తరుణంలో.. ఆ నిర్మాణాలకు అనుగుణంగా.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కొండ దిగువన యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్చర్ ను సంప్రదించి అద్భుతమైన డిజైన్ తయారు చేయించాలని సూచించారు. ఈ నిర్మాణ విషయంలో నిధులు తక్షణమే మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత లక్షలాది భక్తులు యాదాద్రికి తరలివచ్చే అవకాశం ఉన్నందున వారి సౌకర్యార్థం వందలాది మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు.
గుట్ట మున్సిపల్ కు 30 శాతం రికరింగ్ సొమ్మును యాదాద్రి దేవస్థానం చెల్లించాల్సిందే
- . దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ను ఆదేశించిన మంత్రి కేటీఆర్
- . మున్సిపల్ నూతన భవనాన్ని అద్భతంగా నిర్మించండి
- . నిరంతరం కష్టపడే గొంగిడి సునీతామహేందర్రెడ్డి మీ ఎమ్మెల్యే కావడం అదృష్టం
- . యాదగిరిగుట్ట మున్సిపల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో మంత్రి కేటీఆర్
మౌళిక సదుపాయాల కల్పన నిమిత్తం గతంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి యాదగిరిగుట్ట మేజర్ గ్రామ పంచాయితీకి ఇచ్చిన మాదిరిగానే.. ప్రస్తుత మున్సిపల్ కు కూడా 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్ ను చెల్లించాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను గురువారం మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గతంలో మాదిరిగానే యాదాద్రి మున్సిపల్ కు 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్ ను చెల్లించాలని కోరుతూ ప్రభుత్వ విప్, ఆలేరు MLA గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సుమారు అరగంట పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 30 శాతం రికరింగ్ డిపాజిట్ అమౌంట్ ను ఇచ్చే విధంగా తక్షణమే ప్రత్యేక జీవో ను విడుదల చేయాలని కమిషనర్ అనిల్ కుమార్ ను మంత్రి ఆదేశించారు.
<><><>
ఆలేరు నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వ విప్, MLA గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అహర్నిశలు శ్రామిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. ఇలాంటి MLA దొరకడం మీ అదృష్టం.. ఆమె సేవలను వినియోగించుకోండి అంటూ కేటిఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, కౌన్సిలర్లు బూడిద సురేందర్, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, రిజ్వానా, సయ్యద్ బాబా, పేరబోయిన పెంటయ్య, నాయకులు ఎరుకల హేమేందర్ గౌడ్ తదితరులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment