Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్
Showing posts with label Temple News. Show all posts
Showing posts with label Temple News. Show all posts

Friday, August 30, 2024

Yadagirigutta Development - Keesaragutta Reconstruction


🔸 టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు
🔸 కీసరగుట్ట ఆలయం పునర్నిర్మాణం
🔸 దేవాలయాల అభివృద్ధిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ (Yadagirigutta Temple) బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఆగిపోవడానికి వీల్లేదని, ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి. ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.
ప్రస్తుతం కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా, అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని సూచించారు.

#yadadri #yadagirigutta #revanthreddy #keesaragutta #keesara #telangana #rrr

Read more...

Sunday, May 19, 2024

Yadadri needs new steps way at North Side!!? | యాదాద్రి ఉత్తరాన మెట్ల దారి కావాలా !!?

➽ కొండపైకి సరిపడా బస్సులు లేవు 

➽ కారులో వెలుదామంటే ఘాట్ రోడ్డు దగ్గర నిరీక్షణ 

➽ కారు పార్క్ చేసి నడిచి వెళదామన్న మెట్ల దారి లేదు.  

ఒక లక్ష మంది భక్తులు యాదగిరిగుట్ట కు దర్శనానికి వస్తే ఎలా? వారికి కావలసిన సౌకర్యాలు, ముఖ్యంగా వ్యక్తిగత వాహనాల రద్దీ, తెలంగాణ లోని ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సులు మొదలు పెట్టడడం, పట్టణంలోని రహదారులు విస్తరించడం తదితర బృహత్తర మాస్టార్ ప్లాన్ తో మొదలైనదే యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం.  భక్తుల సౌకర్యాల కోసం దాదాపు 1200 ఎకరాల సేకరణ, వాటిలో ఆలయానికి సంబంధించిన వివిద కొత్త నిర్మాణాలు.   పెరిగే భక్తుల రద్దీ ని తట్టుకోవడానికే ఆలయ విస్తరణ చేయడంతో కొండపైన స్థలం కుదించుకు పోయింది. అన్నీ సౌకర్యాలు కొండమీద కలిపించడం సాద్యం కాదనే కొండ క్రింద, క్రొత్తగా కళ్యాణ కట్ట, పుష్కరిణి, అన్నదాన సత్రం, వ్రత మండపం, యాదాద్రి బస్టాండ్, YTDA బస్టాండ్, శాంపిగ్ కాంప్లెక్స్, 3 వ ఘాట్ రోడ్డు, వాహనాల పార్కింగ్, తదితరాలు నిర్మాణాలు చేపట్టారు, అయితే వీటిలో చాలా పనులు ఇంకా పూర్తి కాలేదు.

కొండ మీద సరిపడా స్థలం లేదనే ఆలయ పునః ప్రారంభం తరువాత అప్పటి అధికారులు అన్నీ రకాల వాహనాలను కొండపైకి నిషేదించి, భక్తుల కు కొండ క్రింది నుంచి కొండ మీదికి తీసుకు వెళ్ళడానికి ఉచిత బస్సులు మొదలు పెట్టారు. అయితే రద్దీ రోజులలో సరిపడా బస్సులు లేక పోవడం, ఆటోలు కూడా కొండ మీదికి నడవకపోవడం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగత వాహనాల ద్వారా వచ్చే భక్తుల డిమాండ్, వివిద వర్గాల ప్రజల విన్నపాలతో నాలుగు చక్రాల వాహనాలకు 500/- పార్కింగ్ రుసుం తో కొండ పైకి అనుమతించడం మొదలుపెట్టారు. కొండమీద సరిపడా స్థలం లేదనేది అందరికీ తెలిసిన సత్యం.  ప్రస్తుతం బస్సుల కోసం ఏర్పాటు చేసిన బస్టాండ్ ని పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. ప్రయాణికులకోసం ఏర్పాటు చేసిన ప్లాట్ ఫారాలు షాపింగ్ కాంప్లెక్స్ గా మారి పోయాయి. కొండ మీద ఒక్క దుకాణం కూడా ఉండదన్న గత ముఖ్యమంత్రి మాటలను భేఖాతారు చేస్తూ ఇదే బస్టాండ్ లో దుకాణాలు వెలిసాయి. పార్కింగ్ స్థలంలో టాయిలెట్ కడుతున్నారు, కొండపై ఉన్న కాసింత పార్కు స్థలాన్ని పార్కింగ్ స్థలంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారులు కాసింత పార్కింగ్ స్థలం పెంచినంత మాత్రాన వాహనాల రద్దీ తగ్గిపోతుందా అని స్థానికులు అనుమానం వ్యక్తపరస్తున్నారు. 

తాత్కాలిక నిర్మాణాలతో కాలం వెళ్లదీయలని ఆలోచించే అధికార్లు, ఒకసారి వారి మాస్టర్ ప్లాన్ ముందు వేసుకొని ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరముందని, కొండక్రింద మద్యలోనే ఆగిపోయిన YTDA బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్ స్థలం విస్తరణ, రద్దీ రోజులలో మరిన్ని బస్సులను కొండపైకి నడపడంతో పాటు, హైదరాబాద్ నుంచి కొండ మీది వరకు నేరుగా బస్సులను నడపడం తదితర చర్యలు తీసుకోవలసిన అవసరముందని భక్తులు, స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర దిక్కున కొండపైకి వెళ్ళడానికి మెట్ల దారి లేదు, ప్రస్తుతం దేవాలయానికి సంబంధించిన ప్రదాన సేవలు లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్ట, అన్నదానం, సత్యనారానాయణ వ్రతాలు, వాహనాల పార్కింగ్, కొత్త బస్టాండ్, దుకాణాల సముదాయం, వాహన పూజాలు అన్నీ ఇటు వైపే ఉన్నాయి, కానీ భక్తులు ఇటునుంచి కొండ పైకి వెళ్లాలంటే ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏమి లేదు. స్వంత వాహనాలు ఉన్నవారు వస్తే, పైన ఫోటోలో చూపించించినట్టు రద్దీ రోజులలో కొండ మీదికి ఎంట్రీ కోసం గంటల తరబడి ఘాట్ రోడ్డు వద్ద వేచి చూసే ఇబ్బందులు ఉన్నాయి. వాహనాలను పార్క్ చేసి వెలుదామన్న సరిపడా బస్సులు ఉండవు, ఈ రద్దీ లను దృష్టిలో ఉంచుకొని వ్రత మండపము ప్రక్కనుంచి కొండపైకి కొత్త మెట్ల దారి నిర్మించి భక్తులు తమ ఇష్టానుసారంగా కొండపైకి వెళ్ళి వచ్చే విదంగా ఉండాలని స్థానికులు, భక్తులు కోరుకుంటున్నారు.  

జానీ మహమ్మద్ 

www.manayadadri.com

https://www.youtube.com/manayadadri

Read more...

Tuesday, May 30, 2023

Yadadri 19 days Hundi Amount 2.28 Crores | యాదాద్రి 19 రోజుల హుండీ ఆదాయం 2.28 కోట్లు

తేదీ :-30/05/2023  

శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి 19 రోజుల హుండీ ఆదాయం రూ:- 2,28,25,714-00
(రెండు కోట్ల ఇరవై ఎనమిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే)
మిశ్రమ బంగారము :-   0-095-000 ( తొంభై ఐదు గ్రాములు మాత్రమే)
మిశ్రమవెండి:- 03-700-000 (మూడు కేజీల ఏడు వందల  గ్రాములు మాత్రమే)


విదేశీ రూపాయలు :
అమెరికా - 657 డాలర్లు
యూఏఈ -  దిరామ్స్
ఆస్ట్రేలియా -15 డాలర్స్
కెనడా  -15 డాలర్స్
సింగపూర్ -12 డాలర్స్
యూ ఎ ఈ -40 దీనార్
మలేషియా -57 రింగిట్స్
ఒమన్- 400 బైసా
బహరైన్ 10 దినర్
ఇంగ్లాండ్ 10 డాలర్స్
కతార్ 20
యూరోప్ 20 

#yadadri #Yadagirigutta

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP