Online Services not Available to Yadadri Devotees | పనిచేయని ఆన్ లైన్ వ్యవస్థలు - యాదాద్రి భక్తులకు తప్పని తిప్పలు
యాదాద్రి వెబ్సైట్ తాత్కాలిక మూసివేత
అవస్థలు పడుతున్న భక్తులు
యాదాద్రి కి ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించని TSRTC
ఈ ఎండకాలంలో కనిపించని ఏసీ బస్సులు
గత 30 రోజులుగా మా వెబ్సైట్ www.yadagirigutta.net గణాంకాలు చూస్తే, యాదాద్రి దేవస్థానం ఆన్లైన్ బుకింగ్ వివరాల కోసం, TSRTC బస్సుల ఆన్లైన్ బుకింగ్ వివరాల కొసం ఎక్కువగా వీక్షకులు వచ్చినట్టు తెలిసింది, టాప్ ఐదు పోస్టులలో మొదటి నాలుగు వీటి కోసమే ఉండడం గమనర్హం. దురదృష్టం కొద్ది భక్తులకు ఈ రెండు ఆన్లైన్ బుకింగ్ సేవలు అందుబాటులో లేవు.
యాదాద్రి ఆన్ లైన్ బుకింగ్ : యాదాద్రి నూతన ఆలయం ప్రారంభం తరువాయి దేవస్థానం వారు ప్రారంబించిన వెబ్సైట్ విశేష ఆదరణ పొందింది. అన్నీ ఆర్జిత సేవలు భక్తులు ముందుగానే బుక్ చేసుకొని యాదాద్రి కి వచ్చే వెసులుబాటు ఉండడంతో, భక్తులు ముందుగానే బుక్ చేసుకొని తమ సమయం ప్రకారం సేవలు చేసుకునే వారు. ఈ వెబ్సైట్ ని మరింత ఆధునీకరించే క్రమంలో ప్రస్తుతం దీనిని తాత్కాలికంగా మూసివేశారు, దీంతో భక్తలు తీవ్ర అవస్థలు పడుతున్నారు, అసహనం వ్యక్త ప్రస్తున్నారు, వచ్చే వారం రోజులలో వెబ్సైట్ మళ్ళీ ప్రారంభవుతుందని దేవస్థానం ఈవో శ్రీమతి గీత గారు తెలియచేశారు.
TSRTC ఆన్ లైన్ బుకింగ్ : యాదాద్రి కి హైదరాబాద్ నుంచి ఎక్కువగా భక్తులు వస్తుంటారు, నగరంలోని ఆధునికతకు అలవాటు పడ్డ ప్రజలు సీట్ల కోసం ఫీట్లు పడకుండా, తమ కిష్టమైన సీటు ను ఆన్ లైన్ లో బుక్ చేసుకొని రావలనుకుంటారు. ఇతర రాష్ట్రాలకు, నగరాలు, పుణ్యక్షేత్రాలకు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కలిపించిన ఆర్టీసీ వారు యాదగిరిగుట్ట కు వచ్చే భక్తుల కొసమ మాత్రం అటువంటి సౌకర్యానని కలిగించ లేక పోతున్నారు, సెలవు దినాలలో బస్సుల కోసం , సీట్ల కొసం కుస్తీలు పట్టడం భక్తులకు తప్పడం లేదు. గతంలో ప్రారంబించిన AC బస్సులు, వజ్ర బస్సులు కూడా ఈ ఎండకాలంలో నడవడం లేదు, ఇది కూడా ప్రజలకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది.
కనుల ముందు వేలాది భక్తులు వినియోగదారుల రూపంలో ఉన్న, వారికి సరి అయిన సౌకర్యాలు కలిపించడంలో, మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని సమకూర్చుకుని భక్తులకు, పౌరులకు సేవలు కలిపించడంలో ఈ రెండు సంస్థలు వెనుకబడినట్టు కనిపిస్తుంది.
0 comments:
Post a Comment