Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Thursday, November 3, 2011

Special Batches for Vrathams in Karthika Masam at Yadagirigutta


యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మాసంలో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతపూజలకుగాను విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి సి. ప్రేమ్‌కుమార్ బుధవారం విలేకరులకు తెలిపారు. 

కార్తీక పౌర్ణమి విశేషమైన మాసం అయినందున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వ్రతపూజలు నిర్వహిస్తారని, వారి సౌకర్యార్థం ఎక్కువ సేపు వేచి ఉండకుండా వెంట వ్రతపూజలు జరపడానికి ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు బ్యాచ్‌లకు బదులు ఆరు బ్యాచ్‌ల చొప్పున నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 
మొదటి బ్యాచ్ ఉదయం 6.30 నుంచి 7.30గంటల వరకు, 
2వ బ్యాచ్ 8.30గంటల నుంచి 9.30గంటల వరకు ,
3వ బ్యాచ్ 10.30నుంచి 11.30వరకు, 
4వబ్యాచ్ మధ్యాహ్నం 12.30గంటల నుంచి 1.30 వరకు, 
5వ బ్యాచ్ 2.30గంటల నుంచి 3.30వరకు, 
6వ బ్యాచ్ సాయంత్రం 4.30 నుంచి 5.30గంటల వరకు 
Source : www.namasthetelangaana.com

In view of Karthika Masam, special Satyanarayana Vratham Puja Batches started in Yadagirigutta temple as given above.

0 comments:

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP