Incomplete Road Works Causing problems in Yadagirigutta Town | అసంపూర్ణ పనులతో యాదగిరిగుట్ట ఆగమాగం
రోడ్డు విస్తరణ తరువాత పట్టణంలో పూర్తి కానీ రహదారుల పనులు
కొండపైనుంచి, రింగ్ రోడ్ పైనుంచి వచ్చే నీళ్ళని పట్టణంలోనికి మళ్లింపు
లోతట్టు ప్రాంతాలుగా మారుతున్న పట్టణ వీధులు
సి ఏం ప్రకటించిన మొదలు కానీ రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్
అద్వానంగా గాంధీనగర్, యాదగిరిపల్లి, పాతగుట్ట ప్రదాన రహాదారులు
యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణ, ఆలయ పునః ప్రారంమభమై సంవత్సరం దాటుతున్న పట్టణంలోని రహదారుల పనులు పూర్తి కాక పోవడంతో పట్టణం చాలా అద్వానంగా, ప్రమాదకరంగా మారుతుంది. కొండ మీద నుంచి వర్షాలకు వచ్చే నీళ్లకు సరి అయిన దారి లేకపోవడంతో అవి రింగ్ రోడ్డు మీదికి వచ్చి అటునుంచి పట్టణంలోని వీదుల్లో ప్రవహస్తు పట్టణాన్ని ఒక లోతట్టు ప్రాంతంగా మార్చి వేస్తుంది. ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన రెయిన్ వాటర్ డ్రైన్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ పనులు పట్టణంలో ఇంతవరకు మొదలు కాలేదు.
యాదగిరిగుట్ట ప్రకృతి సిద్దంగా కొండలు, చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతం, పూర్వీకులు చాలా దూరదృష్టితో పట్టణానికి చుట్టూరా యాదగిరిపల్లి చెరువు, గుండ్లపల్లి చెరువు, గండి చెరువు, ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది, చుట్టూ కొండలపై నుంచి పడే వర్షపు నీరు నేరుగా ఆయా చేరువులలోకి వెళ్ళే విధంగా ఏర్పాటులు చేసినట్టు అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. రోడ్డు విస్తరణ, రింగ్ రోడ్డు నిర్మాణం తరువాత ఈ సిస్టమ్ అంతా కనుమరుగైపోయింది. గతంలో ప్రధాన రహదారిలో కొండపైనుంచి వచ్చే వరద వైకుంఠ ద్వారం దగ్గర నుంచి నేరుగా బస్టాండ్ దగ్గర ఉన్న నాలా లోకి వెళ్లిపోయేది, ప్రస్తుతం రోడ్డు పనులు పాతగుట్ట చౌరస్తా వరకే జరిగి ముందుకు సాగడంలేదు, రోడ్డుకు ఇరువైపుల సర్వీసురోడ్డు, దాని ప్రక్కన వరద కాలువ నిర్మాణాలు కూడా అంత వరకే ఉన్నాయి, ఈ పనులు పూర్తికాకపోవడంతో, హనుమాన్ గుడి వద్ద కొండ పైనుంచి వచ్చే నీటిని ప్రక్కనే ఉన్న వరుద కాలువ లోకి మళ్లించకుండా కాలువను మూసి వేశారు, ఆ నీరంత పట్టణంలోని వీధులలోకి చేరుతుంది, భారీ వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్ళు చేరే పరిస్థితిలు ఉన్నాయి.
పాత రిజిస్ట్రేషన్ ఆఫీసు, కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద రింగ్ రోడ్డు పైనుంచి వచ్చే వరద నీరు రోడ్డు పై ఉన్న డ్రైన్ ల నుంచి నేరుగా వెళ్లిపోవాలి, కానీ ఎత్తు పల్లలా ను సరిగా చూసి నిర్మించని కారణంగా ఆ నీరంత రింగ్ రోడ్డు క్రింద ఉన్న యాదగిరిపల్లి రోడ్డు లోకి ప్రవహిస్తున్నది. అలాగే అక్కడే ఉన్న పాత కల్వర్టు స్థానం లో కొత్తది నిర్మించకపోవడం వలన వర్షం వచ్చినపుడల్లా నీళ్ళు రోడ్డు పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
ఇవి కొన్ని మాత్రమే, రోడ్డు విస్తరణ తో ఎన్నో కొత్త ఇబ్బందులు పట్టణంలో ఏర్పడ్డాయి, ముఖ్యంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్ తో పట్టణం రెండు గా విడిపోయింది, ఇరువైపులా రాక పోకలు సాగించడం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది, భారీ వాహనలు వచ్చే పరిస్థితిలేదు, వైకుంఠ ద్వారం నుంచి గాంధీనగర్ వైపు లింకు రోడు వేస్తామని ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదు, జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలలకు, గోశాలకు వెళ్ళడానికి పట్టణంలోంచి నేరుగా దారిలేదు, గాంధీనగర్ వద్ద మరో అండర్ పాస్ నిర్మించి వీటికి దారులు ఏర్పర్చలని స్థానికులు కోరుతున్న పట్టించుకునే వారే కరువైనారు.
ఇప్పటికైన అదికారులు స్పందించి, అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను, ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు అండర్ గ్రౌండ్ వాటర్, అండ్ డ్రైన్ పనులను పూర్తి చేయలని స్థానికులు కోరుతున్నారు.
0 comments:
Post a Comment