TS Govt Sanctioned Govt Medical College for Yadadri | యాదాద్రికి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనుమతి
h యాదాద్రి లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ
h విద్యార్థులకు 100 ఎంబిబిఎస్ సీట్లు
h 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగానే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు, ఈ కాలేజీని యాదాద్రి పట్టణం లో ఏర్పాటు చేసి, ఇక్కడ ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ ఆసుపత్రి కి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. రాబోయే ఈ మెడికల్ కాలేజీకి 100 MBBS సీట్ల విద్యార్థుల కోసం కేటాయించారు.
ఇందుకుగాను GO NO.85, DATED 05-07-2023 విడుదల చేస్తూ, దీని భవన నిర్మాణము, సాంకేతిక ఏర్పాట్లు, పరిపాలన ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, మేనేజింగ్ డైరెక్టర్ TSMSIDC, ఇంజనీర్ ఇన్ చీఫ్ R&B వారిని ఆదేశించారు.
గత నవంబర్ లోనే, యాదాద్రి యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) ని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అబివృద్ది చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విదాన పరిషత్ నిర్ణయం తీసుకుంది, ఇందుకు సంబందించి GO No.722, dated 29-11-2022 ని విడుదల చేస్తూ, అభివృద్ది పనుల కోసం 45.79 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిర్మాణానికి సంబందించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావ్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగిపోయింది, అయితే అదే రోజు ఆసుపత్రి స్థల సేకరణ విషయంలో హరీష్రావు గారు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, పట్టణానికి దగ్గర గా ఉండే స్థలాలు చూడామని కొరినట్టు వార్తలొచ్చాయి.
ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీకి అనుసంధానం కావాలంటే మరింత స్థలం అవసరం అయ్యే అవకాశముంది, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, సిబ్బందికి వసతి, విద్యార్థులకు హాస్టల్, తదితర నిర్మాణాలు చేయాల్సి వస్తుంది, స్థానిక అడికారులు, నేతలు ఏ స్థలాన్ని నిర్ణయిస్తారో వేచి చూడాలి. ప్రతిపాదిత ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు ఇక్కడి విద్యార్థులకు మరింత స్పూర్తి దాయకన్నీ ఇస్తుంది, డాక్టర్ చదువు కోసం ఎక్కడి కొ వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే చదువుకొనే వెసులుబాటు వస్తుంది.
యాదగిరిగుట్ట కు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినందుకు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లను కలిసి యాదగిరి గుట్ట లో వైద్య కళాశాల ఏర్పాటు ఆవశ్యకత ను వివరించిన్నట్లు తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించి, ఉత్తర్వులు జారీ చేయడం సంతోషం గా ఉందన్నారు. స్వామి వారి ఆలయానికి వివిధ దేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు విపరీతంగా పెరిగిపోయారని, వైద్య కళాశాలతో పాటు 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయడం హార్శించదగ్గ విషయమన్నారు. త్వరలో గుట్టలో కళాశాల ఏర్పాటు కు కావాల్సిన స్థలాన్ని సేకరించి ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి లకు ప్రభుత్వ విప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
0 comments:
Post a Comment