విషాదాలకింక స్వస్తి, తెలంగాణ కొరకు కుస్తి! - గోరేటి వెంకన్న
GORATI VENKANNA, TELANGANA POET'S POEM
about the Telengana / United Andhra
ఇద్దరము విడిపోతె బూమి బద్దలవుతుందా
ఇండియా పాకిస్తానోలె ఇనుప కంచె పడుతుందా
రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు
నువ్వు పద్యం పాడితె మేమూ పరవశించనూవచ్చు
నీ ఇడ్లి బండి అడ్డఅట్లే నీవె నిలుపు కోవచ్చు
సెక్రటేరియట్ల మాత్రము చక్రం దిప్పుట సాగది
తెలుగు జాతొక్కటని వొగలబడీ పోతున్నవు
ఒక్క తల్లి బిడ్డలమే ఒప్పుకుంటాము నిజమె
అన్నదమ్ములిద్దరము ఆస్తి పంచుకోవచ్చు
కాని బాదలల్ల నీవు నాతో బాగమయితదెంత చెప్పు
నీతో పడలేక ఆగమయి ఏరుపడి పోతుంటే
వేర్పాటు వాదమని ఎక్కి ఎక్కి ఏడ్చుడేంది?
బాషవొక్కటైతే సరే బాద పెట్టాలనుంద
జాతి వొక్కటైతె నన్ను గోతిల వేయాలనుందా
ఐన పోలికలుండచ్చు గాని పొతన యాడుంది మనకు
యాసలల్ల తేడాలేదా బాసలల్ల తేడాలేద
నీ అట్లతద్దికి బతక్మకు బందుత్వ మెక్కడిది
అట్టుకు జొన్నరొట్టెకు సుట్టరీక మెక్కడిది
గంటె గిన్నలతో వచ్చి వొంట మెసులు మెదలెడ్తిరి
చీరల మూటలతో వచ్చి లారి ఓనర్లైతిరి
సాంబారు పప్పు పొడుల సచ్చురుచులు నేర్పిస్తిరి
నా నాటుకోడి పలావు నీకేటరింగులో కలిపి
పచ్చడి బ్యారాలు జేసి పత్రిక ఓనర్లైతిరి
పట్ణం సివారులన్ని పట్తజేసుకోవడ్తిరి
నల్లరేగడున్నదంటె మెల్లగ మీ పాడెస్తిరి
కోచంగు సెంటర్లను కొల్లలు కొల్లలుగా తెరిచేస్తిరి
కాంట్రాక్టు వరకులల్ల కోట్లు మింగి కూసుంటిరి
కంపెని ఓనర్లయ్యి కాలుష్యం పెంచితిరి
కంపెనీల కొలువులన్నీ మీవారికి పంచితిరి
పబ్లిక్ సెక్టర్ను ముంచి పాట్లు చేసి అమ్మితిరి
సహాజవాయువున్నదని సంకలెగరేస్తున్నవ్
డెల్టా తరిబూముందని డక్కి కొట్టుకుంటున్నవు
విశాకుక్కు నాదేనని మజాకు చేస్తున్నవు.
కాటన్ కట్టను చూసుక కడుపు నిమురు కుంటున్నవు
అన్నుంటే ఉంచుకో నిన్నడిగితే చెప్పుతో కొట్టు
ఏమి లేనోల్లమె మరి ఎందుకు కలిసుంటున్నవు
ఓపికుంటే నా ప్రశ్నకు తీర్పు జెప్పు న్యాయంగ
లెక్క మీద జెప్పు నదులు ఎక్కడి నుండొస్తున్నవి
సాగు యోగ్యమైన బూమి శాతము నీదెంత జెప్పు
గను లెవ్వరివెక్కవో దర్మంగ నీవేజెప్పు
అన్నిమాకుండి చాల అబివ్రుద్దిలో తేడా యాల
అన్ని నీచేతికిచ్చి అడుక్కునుడే ఐక్యతనా
ఊరిలో ఆరెకరం జాగ గూడ లేనోనివి
ఈడికొచ్చి బాబులయ్యి విర్ర వీగి పోవడ్తిరి
ప్రొడ్యూసర్లు దర్శకులు ఫోజుకొట్టే హీరోలై
బాసను హీన జేస్తిరి బతుకును బారం జేస్తిరి
తెలంగాణ ఆడోల్లన రవిడి శకుంతలగ చూపి
గుండగిరికి మా పాత్రలు గుర్తుగ జూపిస్తిరి
అమీరుపేట అడ్డపెట్టీ అదికారం నెరుపుకుంట
హైద్రాబాదు మదేనని అంగడి బ్యారం పెడ్తిరి
కూకటిపల్లి సల్లగ కులుకుతుందని హొయలతోని
కాచిగుడ సుట్టేటము మూసి వాసనట్లేవుంది
వనస్తలిపురమేమొ వన్నె లొలికి పోతుంటే
వారాసి గూడ సుట్టు మోరీల కంపువుంది
బొగ్గుబావులెన్నివున్న అగ్గివెలుగు మకున్న
సాగుఔములాన్ని వున్న ఆకలి సావులే మాకు
త్యాగాల మాచరిత్ర తప్పుదారి మీద్రుష్టికి
విశాలంద్ర గిశాలాంద్ర జాంతానై సమైక్యాంద్ర
విలీనాలు గిలీనాలు మాపాలిట విషాదాలు
విషాదాలకింక స్వస్తి తెలంగాణ కొరకు కుస్తి
1 comments:
jai telangana
Post a Comment