One Day One Crore Yadadri Income | ఒక రోజు ఒక కోటి ఆదాయం లో యాదాద్రి సరికొత్త రికార్డు
యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్ర లో రికార్డు స్థాయిలో గత ఆదివారం (06-11-2022) నాడు మొట్టమొదటి సారి స్వామి వారి ఒక రోజు ఆదాయం 85.62 లక్షల దాటగా, ఈ ఆదివారం (13-11-2022) నాడు గత వారం రికార్డు ను తిరగ వ్రాస్తూ రూ.1,09,82,446/- ఆదాయంతో సరికొత్త రికార్డు నమోదు అయ్యింది.
యాదాద్రి ఆలయం పునః ప్రారంభం (28 మార్చ్ 2022) అయిన తరువాత ప్రతి నెలలో ఏదో ఒక రోజు రికార్డు స్తాయిలో ఆదాయం సమకూరుతుంది, యాదగిరిగుట్ట కు వచ్చే భక్తులు కూడా గణనీయంగా పెరిగారు, సెలవు రోజుల్లో యాదగిరి కొండ చుట్టూ, యాదగిరికొండ పై ఎటు చూసిన భక్తుల కొలహాలం కనిపిస్తుంది. స్వామి వారి పట్ల భక్తులలో పెరుగుతున్న విశ్వాసం, ఆదరణ అనిర్వచనీయమైనది.
తెలంగాణ ప్రభుత్వం, YTDA ఆద్వర్యంలో ఎంతో దూరదృష్థి తో యాదగిరిగుట్ట దేవస్థానానికి దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ జరిపి, కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి, ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటు తేవడం వలన ఇక్కడి కి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు, అయిన ఇంకా భక్తులకు సౌకర్యాల లేమి అప్పుడప్పుడు తెరపైకి వస్తూంది. ఇంకా చాలా అభివృద్ది పనులు పెండిగ్ లో ఉన్నాయి, కొన్ని నత్త నడక సాగుతున్నాయి, పనులన్నీ పూర్తి అయితే యాదాద్రి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని సరికొత్త ఆద్యా యాలు లిఖించడం ఖాయం.
13-11-2022 నాటి ఆదాయ వివరాలు
*శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం - యాదగిరిగుట్ట,యాదాద్రి :
తేది: 13/11/2022*
శ్రీ స్వామి వారి ఆదాయము : రూ1,09,82,446 /-
ప్రధాన బుకింగ్ 3,57,650/-
కైంకర్యములు 10,532/-
సుప్రభాతం 3000/-
వ్రతాలు 13,44,800/-
ప్రచార శాఖ 2,16,500/-
VIP దర్శనం 22,65,000/-
యాదరుషి నిలయం 2,01,332/-
ప్రసాదవిక్రయం 37,36,550/-
పాతగుట్ట. 3,37,650/-
కళ్యాణ కట్ట 1,91,700/-
శాశ్వత పూజలు 42,645/-
వాహన పూజలు 32,500/-
కొండపైకి వాహన ప్రవేశం 10,50,000/-
సువర్ణ పుష్పార్చన 2,83,160/-
వేద ఆశీర్వచనం 16,200/-
శివాలయం 19,300/-
లక్ష్మి పుష్కరిణి -Nil
అన్నదానము 1,78,827/-
లిజేస్ Nil
ఇతరములు Nil
బ్రేక్ దర్శనం 6,95,100/-
0 comments:
Post a Comment