Yadadri Vaibhavam Video Song 2023 | యాదాద్రి వైభవం వీడియో సాంగ్
స్థానిక కవి మిత్రుడు శ్రీపాద శివప్రసాద్ అద్బుతంగా రచించిన యాదాద్రి వైభవం పాట తాను నాకు మొదటి సారి వినిపించినపుడే ఆ పదాలతో పాటు నా ముందు యాదాద్రి దృశ్యాలు కదలాడాయి, యాదాద్రి పునర్నిర్మాణాన్ని దగ్గరగా చూసినవాన్ని, సమయం దొరికినప్పుడల్లా నా కెమెరా తో ఆ దృశ్యాలు చిత్రీకరించిన వాణ్ని, అదే రోజు తన తో చెప్పా, ఈ పాట కనుక నువు ఆడియో గా తీస్తే, నాకు అవకాశమిస్తే, నేనే దీనికి వీడియో చేస్తా అని. గతంలో తాను ఆడియో విడుదల చేయడం జరిగినది. నాకు అవకాశం ఇవ్వడంతో దానికి వీడియో గా రూపొందించి నేడు విడుదల చేయడం జరిగినది. దీనిని ఇరు రాష్ట్రాల తెలుగు గాయని గాయకులు అద్బుతంగా గాత్ర దానం చేశారు, మీరు చూసి మీ అమూల్య మైన అభిప్రాయాలు తెలియచేయండి, పది మందికి షేర్ చేయండి, ఇది మన పాట, మన యాదాద్రి పాట.
0 comments:
Post a Comment