Yadadri Special Cover by India Post | యాదాద్రి స్పెషల్ కవర్ ఇండియా పోస్టు ద్వారా
ఇండియా పోస్టు వారు 28-08-2022 నాడు, తెలంగాణాలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, యాదగిరిగుట్టపై ప్రత్యేక పోస్టల్ కవర్‌ను భువనగిరి హెడ్ పోస్టాఫీసులో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దేవుసిన్హ్ జెసింగ్‌భాయ్ చౌహాన్ విడుదల చేశారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్, హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ పివిఎస్ రెడ్డి పాల్గొన్నారు ఆనాడు పాల్గొన్నారు. విషయం తెలిసిన తరువాత ఆ కవర్ చూడాలనే కుతులహంతో భువనగిరి పోస్టాఫీస్ లో వాకబు చేస్తే స్టాక్ లేదన్నారు. యాదగిరిగుట్ట పోస్ట్ ఆఫీస్ లో అదే జవాబు. చిట్ట చివరికి ఇండియా పోస్టు వారి ఒక ఆన్ లైన్ లింకు ద్వారా కొనుగోలు చేయడం జరిగినది. తెలియని వారు తెలుసుకోవడానికే ఈ పోస్టు
#yadadri #yadagirigutta #yadadritemple #yadadricover
0 comments:
Post a Comment