No Direct Bus to Yadagirigutta Uphill | No Online Booking for Yadagirigutta Bus | కొండపైకి నేరుగా బస్సు ఏది? ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఏది?
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం, కుంభాభిషేకం తరువాత కొండపైన పెద్దగా నిర్మించిన బస్ స్టాండ్ కి రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు వస్తాయని అందరూ అనుకున్నారు. YTDA ప్లాన్ ప్రకారం కూడా రాష్ట్రం లోని కొన్ని పట్టణాలనుంచి యాదగిరి కొండపైకి నేరుగా బస్సులను నడపాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఇవ్వన్నీ పక్కన పెట్టి, కొండపై ఉన్న బస్టాండ్ ను పార్కింగ్ కి, దుకాణాల సముదాయనికి వాడుకోవడం విడ్డూరంగా ఉందని భక్తులు, స్థానిక ప్రజలు అనుకుంటున్నారు.
గతంలో హైదరాబాద్ నగరం నుంచి ప్రతి రోజు యాదగిరిగుట్ట కు ఏసి బస్సులు కొండ క్రింది బస్టాండ్ వరకు వచ్చేవి. అలాగే నగరం నుంచి కొండపైకి నేరుగా వజ్ర మిని ఏసి బస్సులు నడిచేవి, వీటికి ఆన్ లైన్ లో టికిట్ బుకింగ్, సీట్ సెలక్షన్ ఉండేది. ఇది భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండడం తో వాళ్ళు ఆన్ లైన్ లోనే బుకింగ్ చేసుకొని వచ్చి పోయే వారు. కరొన లాక్ డౌన్ లో రద్దు అయిన ఈ సర్వీసులు ఇంతవరకు మళ్ళీ మొదలు కాలేదు.
తెలంగాణ ఆర్టీసీ
రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం ఇతర బస్సులకు కల్పించింది. కానీ, యాదగిరిగుట్ట
కు వచ్చే బస్సులకు ఎలాంటి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా
వినియోగదారుడు అప్డేట్ అవుతున్న
సంస్థలు కాక పోవడం విచారకరమనీ ప్రయాణికులు అనుకుంటున్నారు. సీట్ల కోసం ఫీట్లు చేసే
ప్రయాణికులని, సీట్ల కోసం కొట్టుకునే వారిని మనం తరచుగా బస్సులో, బస్టాండ్ లలో చూస్తున్నాం.
కొండపై బస్టాండ్లో, యాదగిరిగుట్ట బస్టాండ్ లో కూడా ఇలాంటి సంఘటనలు మనం వార్తల ద్వారా
చూశాం. ఆల్ లైన్ బుకింగ్ తో వీటన్నటికి చెక్ పెట్టె అవకాశముంటుంది అని విశ్లేషకులు
అంటున్నారు.
ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా కొండపైకి నేరుగా బస్సులను నడిపే అంశాన్ని, ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యంతో రాష్ట్రం లోని ముఖ్య పట్టణాల నుంచి మిని లగ్జరీ, డీలక్స్ బస్సుల ను నడిపే అంశాన్ని పరిశీలించి, ప్రారంబించాలని భక్తులు కోరుకుంటున్నారు.
గతంలో కొండపైకి నడిచిన వజ్ర బస్సులను చిత్రాలలో చూడవచ్చు.
Read more...